Governor first stern action in president rule

Governor first stern action in President rule, Governor ESL Narasimhan, Strike by Petrol pumps, Petrol pumbs closed, Weights and Measurements department, President rule in AP

Governor first stern action in President rule

రాష్ట్రపతి పాలనలో రాజ్యపాలుని కన్నెర్ర

Posted: 03/04/2014 09:28 AM IST
Governor first stern action in president rule

రాష్ట్రపతి పాలనలో చెయ్యగూడదని తెలిసో తెలియకో పెట్రోల్ పంపులు నిరసన బాట పట్టాయి.  అందుకు కారణం తూనికలు కొలతల శాఖ చేస్తున్న తనిఖీలు, చేస్తున్న మోసాలు దొరికిపోతాయన్న భయం. 

పెట్రోల్ బంక్ లను మూసివేసి వాహనదారులను తీవ్ర అసౌకర్యానికి లోనుచేసిన యాజమాన్యాల తీరు మీద గవర్నర్ కన్నెర్ర చేసారు.  అంతే! గంటలో మూసిన పెట్రోల్ పంపులు బార్లా తెరుచుకున్నాయి. 

సిఎస్ ని, తూనికలు కొలతల అధికారులను రాజ్ భవన్ లోకి పిలిచి ప్రశ్నించిన గవర్నర్ బంక్ లలో జరుగుతున్న అక్రమాలను గురించి తెలుసుకున్నారు, తనిఖీల వలన బంక్ లలోని కార్యకలాపాలకేమైనా అడ్డు వస్తోందా అంటే అదీ లేదని తెలిసింది.  బంక్ లను తెరిపించమని అందుకు అవసరమైతే పోలీసు సహాయం తీసుకోండని గవర్నర్ చెప్పటంతో బంక్ లు యధావిధిగా తెరుచుకున్నాయి.  అంతేకాదు పెట్రోల్ డీజిల్ కొరత కూడా రాకుండా పెట్రోల్ సంస్థల సహాయం కూడా తీసుకోవాలని గవర్నర్ కోరారు.  సమ్మె వంకతో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే భవిష్యత్తులో సహించబోయేది లేదని కఠిన చర్యలుంటాయిని గవర్నర్ ప్రకటించారు. 

సమ్మెలకు పిలుపునిచ్చినవారికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చెయ్యాలని, సేవలను నిలిపివేసిన బంక్ లను సీజ్ చెయ్యాలని కూడా గవర్నర్ ఆదేశాలివ్వటంతో పరిస్థితి చక్కబడింది. 

రిమోట్ కంట్రోల్ సాయంతో పెట్రోల్ సరఫరాని నియంత్రిస్తూ వినియోగదారులను మోసగిస్తున్న పెట్రోల్ పంపుల ఆగడాలు బయటపడటంతో పెట్రోల్ పంపులు ఆదివారం నాడు మెరుపు సమ్మెకు దిగాయి.  అయితే సోమవారం మధ్యాహ్నానికల్లా పరిస్థితంతా సద్దుమణిగింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles