Anuhya case solved at last

Anuhya case solved at last, Anuhya Esther murder case solved, Anuhya murderer nabbed by Mumbai police, Chandrabhan thief nabbed in Anuhya murder case

Anuhya case solved at last, Anuhya Esther murder case solved

రెండు నెలల తర్వాత తేలిన అనూహ్య హత్య కేసు

Posted: 03/04/2014 10:11 AM IST
Anuhya case solved at last

పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా అనూహ్య హత్య కేసులో ప్రధానంగా దొంగతనమే ఉద్దేశ్యంగా మొదలైన నేరంలో తర్వాత అత్యాచారం కూడా చోటుచేసుకునివుండవచ్చని అన్నారు.  హత్యకు గురైన అనూహ్య ధైర్యంగా నేరగాళ్ళను ఎదుర్కోవటంతో వాళ్ళు ఆమెను చంపారని అన్నారు. 

నాసిక్ వాసి చంద్రభాన్ సనప్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నించగా నేరస్తుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించాడని తెలిపారు.  హత్య, సాక్ష్యాధారాలను మట్టుపెట్టిన నేరాలను మోపిన పోలీసులు అత్యాచారం కేసుని తర్వాత చూస్తామన్నారు. 

క్రిస్ట్మస్ సెలవుల్లో సొంతూరు మచిలీపట్నం వెళ్ళి తిరిగి తను పనిచేస్తున్న ముంబైకి బయలుదేరి జనవరి 5 న లోక్ మాన్య తిలక్ టెర్మినల్ కి చేరుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అనూహ్య ఏస్తర్ శవంగా మారి జనవరి 16 న తూర్పు ఎక్స్ ప్రెస్ హైవే మీద తేలింది. 

అనూహ్య తల్లిదండ్రులు పోలీసులు దర్యాప్తులో వెనకాడుతున్నారని ఆరోపించటంతో దర్యాప్తుని చేపట్టి వేగవంతం చేసిన పోలీసులు ఎన్నో క్లూలలో కొంత దూరం వెళ్ళి నేరస్తులను గుర్తించటంలో విఫలమయ్యారు.  చివరకు నాసిక్ నివాసిని రైల్వే సిసి కేమెరాల సాయంతో గుర్తించిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం, నేరస్తుడు ఆ సమయంలో తాగివున్నాడు, రైల్వే స్టేషన్లో దొంగతనం చెయ్యటానికి చిన్నో చితకో దొరక్కపోతుందా అనే ఉద్దేశ్యంతో అడుగుపెట్టాడు. అప్పుడు ఒంటరిగా కనిపించి అనూహ్య అతని కంటబడింది.  రూ.300 లలో ఆమెను జాగ్రత్తగా తన బైక్ మీద ఆమె హాస్టల్ దగ్గర దించుతానని చెప్పిన చంద్రభాన్ ఆమెకు నమ్మకం కలగటం కోసం తన మొబైల్ ని ఆమె చేతికిస్తూ తన బైక్ నంబర్ కూడా నోట్ చేసుకోమని చెప్పాడు.  అయితే ఆ వివరాలను తన స్నేహితులకు అందిస్తున్న అనూహ్య ఫోన్ లో బాలన్స్ లేదని కూడా అతను పోలీసులకు తెలియజేసాడు. 

ఆమె మీద అత్యాచారం చెయ్యటానికి తలపడ్డ నిందితుడు ఆమె ప్రతిఘటనతో ఆమెను చంపటానికి పూనుకున్నాడు.  ఆతర్వాత తన స్నేహితుడితో కలిసి ఆమె టెలిఫోన్ కోసం వెతికాడు కానీ ఆ ప్రాంతమంతా మంచు కప్పివుండటంతో ఫోన్ ని దొరికించుకోలేకపోయాడు.  రైల్వే పోలీసులు అంతకుముందు సనప్ ను ప్రశ్నించారట కూడా కానీ నేరారోపణ చెయ్యలేకపోయారు.  అతను గడ్డం మీసాలు పెంచుకుని ఉండటంతో సిసి కేమెరాలోని ఫుటేజ్ లోని వ్యక్తులతో పోల్చలేకపోయారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles