Jairam ramesh for speedy allocations for divided states of ap

Jairam Ramesh for speedy allocations for divided states, Telangana, Residual Andhra Pradesh, Special financial package to Seemandhra, Rayala Seema, North Coastal Andhra, Planning Commission

Jairam Ramesh for speedy allocations for divided states of AP

విభజన తంతులను త్వరగా పూర్తిచెయ్యమన్న జైరాం రమేష్

Posted: 02/26/2014 10:55 AM IST
Jairam ramesh for speedy allocations for divided states of ap

సీమాంధ్ర ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక ప్యాకేజ్ ల విషయంలో తగు చర్య తీసుకోమని కోరుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేష్ ప్లానింగ్ కమిషన్ డెప్యూటీ ఛైర్మన్ మోంటెక్ సింగ్ అహ్లూవాలియాకి లేఖ రాసారు.  అందులో రాజ్యసభలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటనలను ఉటంకిస్తూ ఈ విధంగా తెలియజేసారు-

తెలంగాణా ప్రాంతాన్ని విడదీసిన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలకు కేంద్ర సహాయం కోసం ఐదు సంవత్సరాల కాలం వరకు ప్రత్యేక ప్రతిపత్తిని కలుగజేయటం జరుగుతుంది.  ఆ 13 జిల్లాలలో 4 రాయలసీమ జిల్లాలు, 3 కోస్తా జిల్లాలున్నాయి. 

తెలంగాణాని విడదీసిన తర్వాతి శేషాంధ్రప్రదేశ్ లో వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం ఉంటుంది.  వాటిని 4 రాయలసీమ జిల్లాలు, 3 ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల అభివృద్ధి కోసం ఇవ్వటం జరుగుతుంది.

పై రెండు ప్రకటనలకు అనుగుణంగా తగు ఆర్ధిక సంబంధిత ఏర్పాట్లను త్వరితంగా చెయ్యవలసిందిగానూ సరిపడా నిధులను కేటాయించవలసిందిగానూ జైరాం రమేష్ అహ్లూవాలియాను కోరారు. 

జైరాం రమేష్ రాష్ట్ర ఉద్యోగుల మంత్రి వి.నారాయణ స్వామికి కూడా లేఖ రాసారు.  అందులో తెలంగాణా శేషాంధ్రప్రదేశ్ లలో ఉద్యోగులను విభజించే పనిని త్వరగా పూర్తి చెయ్యమని కోరారు.  అందులో కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కింది పనిచేసే అధికారులు ఉంటారు కాబట్టి రెండు కమిటీలను ఏర్పాటు చెయ్యవలసివుంటుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles