Jyothirlingas at one place

Visit Jyothirlingas at one place, Brahma Kumaris Rajayoga Center, Twelve Jyothirlingas, Srisailam one of 12 Jyothirlingas, Shivarathri

Visit Jyothirlingas at one place

మహాశివరాత్రి సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకే చోట!

Posted: 02/26/2014 10:21 AM IST
Jyothirlingas at one place

(Image source from: Visit Jyothirlingas at one place)

శివారాధన లో శివధ్యానానికి ప్రాధాన్యత నిచ్చే బ్రహ్మకుమారీస్ ఆధ్యాత్మిక సంస్థ హైద్రాబాద్ లక్డీకాపూల్ లోని వాసవీ అతిధిగృహంలో ద్వాదశ జ్యోతర్లింగాలను ఒకే చోటికి తీసుకునివచ్చి శివభక్తులను భక్తి పారవశ్యులను చేస్తున్నారు. 

ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవటం పుణ్యప్రదంగా భావించే భక్తులు అవన్నీ దేశంలో పలు ప్రాంతాలలో ఉండటం వలన అన్నిటినీ ఒకే రోజు దర్శించుకోలేరు.  వాటన్నిటి రూపాలనూ ఒకే చోటికి తెచ్చిన బ్రహ్మకుమారీస్ జ్యోతిర్లింగాలను ఒకేచోట ఒకేసారి దర్శించుకునే అవకాశం కల్పించింది. 

ఫిబ్రవరి 24 న ప్రతిష్టించిన ఈ జ్యోతిర్లింగాలు  ఫిబ్రవరి 2 వరకు అక్కడే ఉంటాయి.  ఆ పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉంది.  అదే శ్రీశైలంలో భ్రమరాంబికా సమేతంగా కొలువైవున్న మల్లిఖార్జునుడు. 

ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవి-

1. గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం,
2. ఉజ్జైన్ లోని మహాకాళేశ్వరాలయం
3. శ్రీశైలం లోని మల్లిఖార్జునుడు,
4. మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వరుడు
5. జార్ఖండ్లో పర్లిలోని వైద్యనాథుడు
6. పూణెలోని భీమ శంకరుడు
7. ద్వారక లోని నాగేశ్వరుడు
8. రామేశ్వరంలోని రామలింగేశ్వరుడు
9. కాశీ విశ్వనాధుడు
10. నాసిక్ లోని త్ర్యంబకేశ్వరుడు
11. ఔరంగాబాద్ గృష్ణేశ్వరుడు
12. కేదార్ లోని కేదారనాధుడు


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/Jyothirlingas

ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకుని శంకరాచార్యుల విరచిత జ్యోతిర్లింగ శ్లోకాన్ని చదువుకునేవారికి పాపాలన్నీ నశించి పునీతులౌతారని హిందువుల నమ్మకం.                                        

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles