Some mps and mlas represent both telangana and andhra pradesh

Some MPs and MLAs represent both Telangana and Andhra Pradesh, Bhadrachalam division, 136 villages merge Seemandhra, 2 MPs, 3 MLAs in Seemandhra, Seemandhra MPs MLAs in Telangana

Some MPs and MLAs represent both Telangana and Andhra Pradesh

రెండు రాష్ట్రాలలోనూ ప్రాతినిధ్యం వహించే కొందరు ప్రజాప్రతినిధులు

Posted: 02/26/2014 11:37 AM IST
Some mps and mlas represent both telangana and andhra pradesh

తెలంగాణా ప్రాంతంలోని ముంపుకు గురయ్యే 136 గ్రామాలు తెలంగాణాను విడదీయగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపటం వలన ఆ ప్రాంతాల ప్రజాప్రతినిధులకు ఇరు రాష్ట్రాలలోనూ ప్రాతినిధ్యం వహించవలసి వస్తుంది. 

తెలంగాణా ప్రాంతంలోని ఆ 136 గ్రామాలలోని 60000 మంది జనాభాకు ప్రాతినిధ్యం వహించే ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో ఈ లోపులోనే ఎన్నికల కమిషన్ డిలిమిటేషన్ తంతుని పూర్తి చెయ్యకపోయినట్లయితే వాళ్ళుండేది ఆంధ్ర ప్రదేశ్ లో, లోక్ సభ, శాసన సభలలో తెలంగాణాలో ఉంటారు. 

ఈ సమస్య తెలంగాణా ఆవిర్భావ దినాన్ని (అప్పాయింటెడ్ డే ని) ఎన్నికల లోపులోనే ప్రకటించినట్లయితే తలెత్తుతుంది.

ఇలాంటి సమస్యే విద్యారంగంలో భద్రాచలం డివిజన్ లో లోగడ ఒకసారి తలెత్తింది.  భద్రాచలం డివిజన్ ఖమ్మం జిల్లా కింద ఉండగా విద్యాసంస్థలు మాత్రం అంతకు ముందు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నప్పటి లాగానే ఆ జిల్లా విద్యాశాఖ కింద కోనసాగాయి, పబ్లిక్ పరీక్షలు ఆంధ్రా యూనివర్శిటీ కిందికి వచ్చాయి.  ఉపాధ్యాయులు తూర్పు గోదావరి జిల్లానుంచి వచ్చేవారు.  దీనివలన విద్యార్థులు పై చదువులకు పోవటంలో సమస్యలను ఎదుర్కున్నారు.  అప్పుడు ముల్కీ సర్టిఫికేట్ అవసరం కూడా ఉండేది కనుక భద్రాచలం డివిజన్ లోని విద్యార్థులు ఉన్నది తెలంగాణాలోనే అయినా కాలేజ్ చదువులకు ఆంధ్రా ప్రాంతానికి పోవలసివచ్చేది. 

ఇలాంటి సమస్య ఇప్పుడు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులకు రాకుండా ఉండాలంటే అప్పాయింటెడ్ డేని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల తర్వాత ప్రకటించవలసి వుంటుంది.  కానీ కాంగ్రెస్ కి మద్దతుగా నిలవటమో లేక విలీనం కావటమో చేసే దిశగా ఆలోచిస్తున్న తెరాస రెండు రాష్ట్రలలో ఎన్నికలు విడివిడిగా జరగాలని కోరుకుంటోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles