Unshattered dream of lalu

Unshattered dream of Lalu to become PM, Lalu Prasad Yadav in fodder scam, Rahul Gandhi, Supreme Court of India, Govt ordinance protecting criminals

Unshattered dream of Lalu to become Prime Minister of India

లాలూ ప్రధానమంత్రి కల చెరిగిపోలేదట!

Posted: 02/22/2014 04:37 PM IST
Unshattered dream of lalu

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, పశువులదాణా కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ తను ప్రధాన మంత్రి అవదలచుకున్న కల ఇంకా చెరిగిపోలేదని తానిప్పటికీ ప్రధాన మంత్రి అవటానికి సిద్ధమేనని అన్నారు.   కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని మత కలహాలను రేపి విద్వేషాలను కలిగించే పార్టీలను రూపు మాపుతానని అన్నారాయన.

ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీల మీద తన వ్యతిరేకతను వెల్లడి చేస్తూ, నరేంద్ర మోదీని, అరవింద్ కేజ్రీవాల్ ని అడ్డుకోవటమే తన ధ్యేయమని చెప్పారు లాలూ ప్రసాద్ యాదవ్.  కాంగ్రెస్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీలతో పొత్తుతో వచ్చే ఎన్నికలలో గెలుస్తామని, కాంగ్రెస్, రామ్ విలాస్ పాశ్వాన్ లతో కలిసి దేశంలో మత విరోధ శక్తలను ఎలా చిత్తు చేస్తామో చూద్దురుగాని అన్నారాయన. 

థర్డ్ ఫ్రంట్ లో కలుస్తారా అని అడిగిన ప్రశ్నకు ఏమాత్రం కలవనని ఆయన సమాధానం ఇచ్చారు.  ఎందుకంటే ధర్డ్ ఫ్రంట్ లో చేరేవారంతా ప్రధానమంత్రి పదవిని ఆశించేవారేనని చెప్పారాయన.  అలాంటప్పడు ప్రధాని పదవి కోసమే కలలు కంటున్న తను ఎలా చేరతారన్నది మనం అర్థం చేసుకోవచ్చు. 

కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవలనుకుంటున్న లాలూ ప్రసాద్ యాదవ్ తనకు పడ్డ జైలు శిక్షకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదన్నారు.  తనని కావాలని రాజకీయంగా అనర్హుడిగా చెయ్యటం కోసం రాహుల్ గాంధీ ఆర్డినెన్స్ ని వ్యతిరేకించారనటం సరికాదన్నారాయన.  అంటే లాలూ ప్రసాద్ ఉద్దేశ్యంలో తాను రాహుల్ గాంధీక సమవుజ్జీ అని, తన వలన ఆయన ప్రధాన మంత్రి కాలేకపోతాడని భయమన్నమాట!

అలాగని ఆర్డినెన్స్ ని పాస్ చెయ్యటం కూడా తనను కాపాడటం కోసం కాదని కూడా ఆయన అన్నారు. 

నేరచరిత కలవారు ప్రజాప్రతినిధులుగా అనర్హులని సుప్రీం కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ని పాస్ చెయ్యగా కొన్ని రోజుల తర్వాత రాహుల్ గాందీ అది సరైన చర్య కాదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  దానితో ఆ ఆర్డినెన్స్ ని కేంద్రం రద్దు చేసింది.  అంటే సుప్రీం కోర్టు తీర్పే ప్రస్తుతం అమలులో ఉంది. 

అలాంటప్పడు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధాన మంత్రిగా అధికారాలు చేపట్టే కల చెదరలేదు అంటే లాలూ ప్రసాద్ యాదవ్ ఇంకా నిద్ర లోంచి లేవలేదన్న మాట అంటూ ఒక రాజకీయ విశ్లేషకుడు చమత్కరించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles