Congress anger towards tdp understandable says chandra babu

congress angry with TDP Chandra Babu, Congress party, Telugu Desam Party, TDP founder NT Rama Rao, Chandra Babu Naidu, TRS, YSRCP, State bifurcation

congress anger towards TDP understandable says Chandra Babu

తెదేపా మీద కాంగ్రెస్ కి కోపమే మరి

Posted: 02/22/2014 04:00 PM IST
Congress anger towards tdp understandable says chandra babu

తెలుగు దేశం పార్టీ మీద కాంగ్రెస్ కి కోపం ఉండటం సహజమేనన్నారు చంద్రబాబు నాయుడు.

తెలుగు దేశం ఆవిర్భావంతో కాంగ్రెస్ కి కళ్ళెంపడిందని, రాష్ట్రం నుంచి తరిమికొట్టబడిందని, తొమ్మిది నెలల కృషితోనే రాష్ట్రంలో అదికారంలోకి వచ్చి చరిత్రను సృష్టించిందని అన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మాట్లాడిన చంద్రబాబు.  రాష్ట్రంలోనే కాక దేశంలో జాతీయ స్థాయిలో కూడా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా తయారు చేసింది కూడా తెదేపాయేనని, అందుకే కాంగ్రెస్ కి తెలుగుదేశంమంటే ఎక్కడలేని కోపమని చంద్రబాబు అన్నారు.

దేశానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీయని, దాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టిన ఘనత తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ దేనని చంద్రబాబు నాయుడు అన్నారు.  తెదేపా మీద కత్తిగట్టిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలోను సీమాంధ్రలోను తెరాస, వైకాపాల మద్దతు తీసుకుంటోందని కూడా ఆయన అన్నారు. 

తెలంగాణాకు తామెప్పుడూ వ్యతిరేకులం కామని, కాకపోతే సమన్యాయం చెయ్యకుండా అడ్డగోలుగా విభజన ప్రక్రియకు పూనుకోవటమే అధికార విపక్షాలు చేసిన తప్పని అన్న చంద్రబాబు దేశంలో మరోసారి తమ పార్టీ చరిత్రను సృష్టిస్తుందని, రాష్ట్ర విభజన ఎన్నికల లోపు జరిగినా తెలంగాణా సీమాంధ్రలలో గెలుపు తమ పార్టీదేనని తెలుగు దేశం పార్టీ భవిత గురించి తనకున్న గట్టి నమ్మకాన్ని చంద్రబాబు వెల్లడిచేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles