Pmk leader ramdoss demand to giveback tirupati to tamilnadu

PMK leader S Ramadoss, Tirupati, Tirukalahasthi, Chitoor, Puttur and Satyavedu, Ramadoss wants Tirupati to merge with Tamil Nadu, Give Tirupati to Tamil Nadu, Pattali Makkal Katchi, Tamil Nadu, telangana, andhrapradesh, seemandhra.

pmk leader ramdoss demand to giveback tirupati to tamilnadu

అసలు తిరుపతి మాది.. మాకిచ్చేయండి?

Posted: 02/20/2014 10:46 AM IST
Pmk leader ramdoss demand to giveback tirupati to tamilnadu

‘‘అసలే మొగుడు పోయి.. లబోదిమోని  మొత్తుకుంటుంటే  రంకు మొగుడు వచ్చి రాయి విసిరాడట’’  అలా ఉంది.  అసలే  ఆంద్రప్రదేశ్  రెండు ముక్కలైంది, తెలుగు జాతి  రెండుగా విడిపోయింది.  తెలుగు ప్రజలు  విడిపోయారని , సీమాంద్ర నేతల , ప్రజలు బాధపడుతుంటే.. ‘‘రాచపుండు మీద కాకి పొడిచినట్లు’’మరో కొత్త సమస్యను కాంగ్రెస్ పెద్దలు స్రుష్టించారు.  ఇది కూడా  చిదంబంరం చిచ్చే అని సీమాంద్ర నేతలు అంటున్నారు.  

అసలు  తిరుపతి  మాది.. కాబట్టి మాకి చ్చేయండని  తమిళనాడు  రాష్ట్రానికి  పీఎంకే పార్టీ సినియర్   నాయకుడు రాందాస్ అన్నారు. ‘1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సమయంలో తమిళనాడు సరిహద్దులను పునర్వ్యవస్థీకరించారు. తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, సత్యవేడు తదితర తమిళులు అధికంగా నివసిస్తున్న తొమ్మిది ప్రాంతాలను ఆంధ్రాలోకి కలిపేశారు. 

రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం రూపంలో తెలంగాణకు న్యాయం చేసినట్టే..తమిళనాడు ప్రజల ఆకాంక్షను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాలుగా తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ వేరుపడిన సమయంలో తమిళులు అధికంగా నివసిస్తున్న తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు ప్రాంతాలను నిర్బంధంగా అప్పట్లో కలిపేశారంటూ ఆయన ఆరోపించారు. 

అప్పటి నుండి ఇప్పటి వరకు  తమిళులు  తిరుపతి పై పోరాటం చేస్తున్నా .. కేంద్రం పట్టించుకోవటం లేదని ఆయన అన్నారు. ఇప్పుడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్న సమయంలోనే తమిళుళ ఆకాంక్షను కూడా  కేంద్రం నేరవేర్ఛాలని  ఆయన కోరారు. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles