రాబోయే ఎన్నికలలో మందు పారకుండా కట్టుదిట్టాలు చేస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ హామీ ఇస్తున్నారు. కానీ, మందుబాబులం మేమూ మందుబాబులం..... అంటూ ఎన్నికలకు వస్తే ఓటు వెయ్యవద్దని అడ్డు పెట్టటానికి రాజ్యాంగం అధికారాలిచ్చిందా అంటే లేదనే చెప్తుంది ఎన్నికల కమిషన్.
ఏ ప్రలోభానికీ లొంగకుండా, ఎటువంటి ఒత్తిడిలూ, ఏ బెదిరింపులకూ లోబడకుండా స్వచ్ఛందంగా తన మనసుకి తోచిన నాయకుడిని ఎన్నుకోవటానికి వోటున్న ప్రతివారికీ హక్కుంది. ఎవరు ఎవరికి వోటేసారే తెలియకుండా ఉండటం కోసమే సీక్రెట్ బ్యాలెట్ అమలులో ఉంది. అందువలన దేనికీ భయపడకుండా మొఖమాటాలకు తావు లేకుండా వోటర్ తన హక్కుని వినియోగించుకోవచ్చు. ప్రభుత్వాన్ని నడిపే నాయకులను ఎన్నుకోవటానికి తగిన మానసిక ఎదుగుదల ఉన్నవాళ్ళకే ఆ హక్కుని రాజ్యాంగం ప్రసాదించింది. అంటే మైనారిటీ దాటిన తర్వాతనే వోటు హక్కు లభిస్తుంది.
కానీ మత్తులో జోగేవాళ్ళ మెదడు వాళ్ళ అదుపులో ఉంటుందా. అలాంటివాళ్ళు నిజంగా సరైన నిర్ణయం తీసుకోగలిగే స్థితిలో ఉంటారా. మైనార్టీ దాటినంత మాత్రాన సరిపోతుందా.
వోటర్లను ఎటువంటి ప్రలోభాలకూ గురికాకుండా చూసే బాధ్యత ఎన్నికల కమిషన్ మీదనే ఉంది. అందుకే ఎన్నికల కమిషన్ కి ఎన్నికల సమయంలో పోలీసు మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. ఎన్నికలు జరిగే సమయంలో వైన్ విక్రేతలను కట్టడి చెయ్యటం జరుగుతుంది. బెల్ట్ షాపుల మీద నిఘా ఉంటుంది. అక్రమంగా లిక్కర్ తరలించకుండా తనిఖీలుంటాయి. అయినా అధికారులకు తెలిసో తెలియకుండానో తెరమరుగున లిక్కర్, డబ్బు వితరణ జరుగుతూనేవుంటుంది.
రెండు రోజుల ముందుగానే లిక్కర్ ని ఇంట్లో పెట్టుకుని ఆరోజు ఫుల్ గా తాగి వోటెయ్యటానికి పోతే ఏం చెయ్యగలరు.
అందువలన సరైన నియంత్రణ ఏమిటంటే, ఎన్నికల సమయంలో మద్యపానాన్నే పూర్తిగా నిషేధించాలి. మద్యం సేవించి వచ్చిన వోటర్లకు వోటు హక్కుండగూడదు. ఒకసారి వోటు వేసినవారికి మరోసారి వెయ్యటానికి హక్కు ఎలాగైతే ఉండదో అలాగే ప్రతివాళ్ళనీ టెస్ట్ చేసి ఏ డ్రగ్స్ లేక లిక్కర్ ప్రభావంలో లేరని తెలిస్తేనే వాళ్ళని వోటు వెయ్యటానికి అనుమతించాలి.
ఎన్నికల కమిషన్ తలచుకుంటే ఈ పని చెయ్యగలుగుతుంది. వోటర్ ని ప్రభావితం చేసే ప్రచారాలనే 24 గంటల ముందు నిషేధించిన ఎన్నికల కమిషన్, ఆ పని చెయ్యటానికి కారణం వోటర్ ఆ సమయంలో స్వతంత్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావటం కోసం. అలా నిర్ణయం తీసుకునే స్థితిలో లేకపోతే వోటర్ ని వోటు హక్కుని వినియోగించనిచ్చినట్లయితే అనర్హులకు పట్టం కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్నికల సమయంలో లిక్కర్ ని అందుబాటులో ఉంచకపోవటం, రాజకీయ పార్టీలు వోటర్లను ప్రలోభపెట్టటానికి సరఫరా చెయ్యనీయకపోవటమే కాదు రోడ్ల మీద డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించిన విధంగా ఎన్నికలప్పుడు కూడా నిర్వహించగలిగితే చాలా మార్పు వస్తుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more