Supreme court rejected all petitions on t bill

Supreme court rejected all petitions on T bill, AP State Reorganization Bill 2013, Petitions on State bifurcation rejected by SC

Supreme court rejected all petitions on T bill, AP State Reorganization Bill 2013

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ చేసిన పిటిషన్ల కొట్టివేత

Posted: 02/07/2014 01:57 PM IST
Supreme court rejected all petitions on t bill

రాష్ట్ర విభజన కోసం కేంద్ర ప్రభత్వం తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో వేసిన తొమ్మిది పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరిస్తూ, ప్రస్తుత పరిస్థితులలో ఆ విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. 

ఇంతకుముందు వేసిన పిటిషన్లను కొట్టి వేసిన సమయంలో ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి తేడా ఏమీ లేదని కూడా సుప్రీం తెలియజేసింది.

రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడును అరికట్టటం కోసం సుప్రీం కోర్టులో వేసిన వివిధ పిటిషన్లమీద ఒకే సమయంలో విచారణ చేపట్టిన జస్టిస్ జె.ఎల్ దత్తు, జస్టిస్ బోబ్డేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదురుగా పిటిషన్ల తరఫున సీనియర్ న్యాయవాదులు నారిమన్, మోహన్ లాల్ శర్మలు వాదించారు. 

ఆర్టికల్ 3 మీద, 371 డి ఇ లమీద, అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లు ప్రస్తావన తెస్తూ శ్రీకృష్ణ కమిటీ పరిశీలనలను ఉటంకిస్తూ వాదన సాగింది. 

కానీ చివరకు ధర్మాసనం అన్ని పిటిషన్లనూ తిరస్కరించింది. కానీ చివరకు ధర్మాసనం అన్ని పిటిషన్లనూ తిరస్కరించింది.   ఇప్పుడు దీనిమీద నిర్ణయం తీసుకుంటే అది తొందరపాటు చర్య అవుతుందని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles