Sujatha guduru shifted to jail

Sujatha Guduru shifted to jail, Chetana Guduru cremated in State Home, Sujatha kills her daughter, Sujatha shot herself, First degree murder case on Sujatha Guduru

Sujatha Guduru shifted to jail, Chetana Guduru cremated in State Home

కన్నకూతురిని కాల్చ్ చంపిన ఎన్నారై జైలుకి తరలింపు

Posted: 02/01/2014 08:40 AM IST
Sujatha guduru shifted to jail

ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓర్లాండో నగరంలో 17 సంవత్సరాల కూతురు చేతనని గన్ తో కాల్చి చంపి తానూ కాల్చుకున్న 44 సంవత్సరాల సుజాత గూడూరుని హాస్పిటల్ నుంచి గురువారం సాయంత్రం జైలుకి తరలించారు అధికారులు. 

ఈ పని ఏదో ఆవేశంలో జరిగింది కాదని, 21 వ తేదీనే సుజాత .38 క్యాలిబర్ తుపాకీని స్థానిక దుకాణం నుంచి కొనుగోలు చేసారని పోలీసులు తెలియజేసారు.  తాను చెయ్యబోతున్న ఘోరాన్ని ముందుగానే ఆమె తన సోదరుడికి ఇ మెయిల్ ద్వారా తెలియజేసారు.  ఆయన వచ్చేసరికి రక్తమోడుతూ చేతన పక్కనే పడివున్న సోదరిని చూసి పోలీసు అత్యవసర నంబర్ 911 కి ఫోన్ చేసారాయన.  ప్రాణాలోత కొట్టుమిట్టాడుతున్న ఆమెను వెంటనే ఆమెను హాస్పిటల్ కి తరలించి వైద్య సేవలందించారు. 

హాస్పిటల్ లో స్పృహలోకి వచ్చిన తర్వాత, ఆ నేరం తనే చేసానని, కూతురిని ముఖం మీద కాల్చి ఆమె చనిపోయిందని నిర్దారణ చేసుకున్న తర్వాతనే తాను కాల్చి చంపుకునే ప్రయత్నం చేసానని సుజాత గూడూరు పోలీసులకు చెప్పారు.  తాను ఏమి చెయ్యబోతున్నది, తన ఆస్తులు ఎవరెవరికి దక్కాలన్నది కూడా ఆమె ముందుగానే ప్రకటించారు.  అందువలన దీన్ని ఫస్ట్ డిగ్రీ మర్డర్ గా పోలీసులు నమోదు చేసుకున్నారు. 

ఈ కేసులో ఎటువంటి అనుమానాలకూ తావు లేదని ఇది పూర్తిగా ఓపెన్ అండ్ షట్ కేసని పోలీసులు చెప్పారు.  చేతన పార్ధివ శరీరానికి ఒర్లండ్ హోం లో అంత్యక్రియలను నిర్వహించారు.

ఇటువంటి అఘాయిత్యానికి ఎందుకు పూనుకున్నారో తెలియదు కానీ చేతన తండ్రితో విడాకులు తీసుకుని తన తల్లితో పాటు ఆ ఇంట్లో ఉంటున్న సుజాత ఇమెయిల్ లో తన తర్వాత తన కూతురు ఎలా బ్రతుకుంది అనే ఆవేదనను వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. 

Related article

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles