Indian small cars safety risk

Indian small cars safety risk, Tata Nano, Maruti Alto, Ford Figo, Hyundai I 10, Global NCAP

Indian small cars safety risk

చిన్న కార్ల ప్రయాణీకులకు పొంచివున్న ప్రమాదం

Posted: 01/31/2014 06:06 PM IST
Indian small cars safety risk

లండన్ కి చెందిన అంతర్జాతీయ భద్రతా సంఘమైన గ్లోబల్ ఎన్ సి ఎ పి ఈ రోజు భద్రతా దృష్ట్యా భయంకరమైన నిజాన్ని వెల్లడి చేసింది. 

భద్రతా పరీక్షలో భారతదేశపు కార్లలో ఐదు కార్లు విఫలమయ్యాయని, కేవలం 64 కిలోమీటర్ల వేగంలో వెళ్తున్నప్పుడు కూడా ప్రమాదం జరిగితే అందులో ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పు పొంచివుందని పరీక్షల్లో తేలిందని చెప్పిన భద్రతా సంఘం ఆ ఐదు కార్లు టాటా నానో, మారుతి ఆల్టో, హ్యుండయ్ ఐ 10, ఫోర్డ్ ఫిగో అని చెప్పింది.

భారతదేశంలో చిన్న కార్లకు మంచి మార్కెట్ ఉందని, అయితే భద్రతా విషయంలో మాత్రం 20 సంవత్సరాలు వెనకబడివుందని తెలియజేసింది.  యూరప్, ఉత్తర అమెరికాలో ఇప్పుడు 5 స్టార్ భద్రతా ఏర్పాట్లు సర్వసాధారణమైపోయాయని గ్లోబల్ ఎన్ సి ఎ పి ఛైర్మన్ మాక్స్ మోస్లీ అన్నారు. 

భారత దేశంలో కారు ధరలను అందరికీ అందుబాటులోకి తేవటం కోసం కొన్ని భద్రతా ఏర్పాట్లను తక్కువ చేసినట్లుగా తెలుస్తోంది.  అయితే మారుతి ఉద్యోగ్, హ్యుండైలు వెంటనే వివరణనివ్వలేదు కాని మిగిలిన సంస్థలు మాత్రం భారత భద్రతా నియమాలననుసరించే ఉత్పాదన జరుగుతోందని చెప్పాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles