Rahul gandhi ready for pm role

Rahul ready PM role, 2014 Lok Sabha polls, AICC meet on January 17, BJP, Aam Aadmi Party, AAP

Congress vice-president Rahul Gandhi on Tuesday said that he is ready to take any responsibility if given, adding that he will do whatever the party wants him to do.

మనస్సులో మాట బయట పెట్టిన రాహుల్

Posted: 01/14/2014 03:42 PM IST
Rahul gandhi ready for pm role

2014 ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రధాని అభ్యర్థిని ప్రకటించలేదు. ఇప్పటికే బాజాపా నరేంద్ర మోడీనీ ప్రకటించి ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా ప్రచారాన్ని కూడా మొదలు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ అని ఎప్పటి నుండో ప్రచారంలో ఉన్నా ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి బాగోలేక పోవడం,  ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రచారం పార్టీకి ఏ మాత్రం కలిసి రాకపోవడంతో అభ్యర్థి విషయంలో మల్ల గుల్లాలు పడుతుంది.

ఈయన స్థానంలో కాంగ్రెస్ ప్రియాంక గాంధీ పేరును పరిశీలిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఓ ఛానల్ కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్య్వూలో మాత్రం తాను కాంగ్రెస్ సిపాయినని, ఏ బాధ్యత అప్పగించినా స్వీకరించడానికి సిద్దమని ఆయన ప్రకటించాడు.

ఈనెల 17వ తారీఖున ఏఐసీసీ సమావేశం జరగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇలా మాట్లాడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ స్టేట్ మెంట్ తో తాను ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి దిగడానికి సిద్దం అని ప్రకటించినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.తనకు పార్టీ బాధ్యతను అప్పగించినా తాను భయపడనని ఆయన చెప్పారు. ఇప్పటికే అనేక ఆరోపణలు, కుంభకోణాలతో ఉన్న యూపీఏను రాహుల్ మూడో సారి అధికారంలోకి తీసుకొని వస్తాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles