Ap recommends bharat ratna for pv

P.V. Narasimha Rao, Bharat Ratna,Andhra Pradesh,Hyderabad,politics,government

Narasimha Rao, the State Government recommended 36 eminent persons from various fields for this years Padma awards.

పీవీ పేరును ఆంద్రోళ్ళు వాడుకుంటున్నారా ?

Posted: 01/14/2014 01:11 PM IST
Ap recommends bharat ratna for pv

ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో సేవలు అందించిన ప్రముఖులకు ప్రకటించే ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డుల కోసం మన రాష్ట్రం నుండి 36 మంది సభ్యులతో కూడిన లిస్టును కేంద్రానికి పంపింది. దాంతో పాటు దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్న అవార్డుకు మన తెలుగు తేజం, మాజీ ప్రధాని అయిన పీవీ నరసింహా రావుకు ఇవ్వాలని సిఫార్సు చేసింది. పీవీ నరసింహారావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా అందించిన సేవలకు గుర్తింపుగా భారతరత్న ప్రకటించాలని కోరింది.

మరి ఇన్నాళ్ళకు పీవీని రాష్ట ప్రభుత్వం గుర్తించడం సంతోషకరమైన విషయమే కానీ, మరి పేరును ప్రభుత్వం మనస్ఫూర్తిగా ప్రతిపాదించిందా అనేదే ఇక్కడ ప్రశ్న. కానీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు ప్రెవేటు వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ రూపంలో కోరారని, ఆ మేరకే ప్రభుత్వం ఈ సిఫారసు చేసిందని వార్తలు వస్తున్నాయి. అంటే తెలంగాణ వాదులకు పీవీ మీద ఎలాంటి ప్రేమ లేదని తెలియజేసేందుకే సీమాంధ్రులచే లేఖ రాయించి ఉంటుందని, ఇలా పీవీ పేరును సీమాంధ్రులు వాడుకుంటున్నారు.

సీమాంధ్ర ప్రాంత నాయకులు, తెలంగాణ ప్రాంత నాయకులు ఎవరెన్ని కుట్రలు పన్ని క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నా, అది ఆయనకు దక్కేలా చూస్తే చాలా మంది ఆనందపడతారనడంలో ఎటువంటి సందేహం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles