Arvind kejriwal

Aam Aadmi Party AAP, Arvind Kejriwal, janta darbar, janta darbar scraps, Mr Kejriwal

Chief Minister Arvind Kejriwal has abandoned plans to hold a janta darbar" or public feedback session once every week, vowing instead to meet people instead more informally for two-three hours.

సామాన్యుడికి దూరమైన కేజ్రీవాల్

Posted: 01/13/2014 04:11 PM IST
Arvind kejriwal

 

 

 

సామాన్యుడికి  దూరమైన కేజ్రీవాల్
అర్ధాంతరంగా  కేజ్రీవాల్ జనతా దర్భార్ ను మూసివేశాడు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమంటూ  చేపట్టిన జనతా దర్బార్  మూసి వేయడంతో పాటు తానే స్వయంగా  ప్రజలను కలుసుకోనున్నట్లు  ప్రకటించారు. దీని  నిర్వహణకు  ఆటంకాలు  ఏర్పడుతున్నందున దీనిని మూసివేస్తున్నట్లు  ప్రకటించారు. అయితే ప్రజల ఫిర్యాదులను  ఆన్ లైన్లో  తీసుకోనున్నట్లు  వెల్లడించారు.

ఈ  నిర్ణయంపై  జనం  నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి  తమ సమస్యలను నేరుగా వింటారని భావించిన జనాలు దీనిపై పెదవి విరుస్తున్నారు. పైగా దీనికి తగిన వివరణ ఇవ్వాలని కోరుతున్నారు. ఇదిలాఉంటే కేజ్రీవాల్ తొలిసారిగా ఢిల్లీలో నిర్వహించిన  ప్రజాదర్బార్  రసాభాసగా మారింది. వేలమంది జనం ఒకేసారి వెల్లువలా రావడం, ఆపై వారిని నియంత్రించేవారు కరువవడంతో  సభాస్థలిలో తొక్కిసలాట చోటు చేసుకుంది.

ఈ దదిమిలా  తీవ్ర గందరగొళం  చెలరేగింది. దీంతో కేజ్రీవాల్ వారం రోజుల్లోగా తిరిగి జనతా దర్బార్ ను నిర్వహిస్తామని  చెప్పి తప్పించుకున్నారు.  అయితే కేజ్రీవాల్ నిర్ణయం పై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. సామాన్యుడి  పార్టీ అంటూ ప్రజల్లోకి వచ్చిన కేజ్రీ వాల్ ఇలా చేయడం జనాలకు మింగుడు పడడం లేదు. ఇది కూడా అన్ని పార్టీల్లానే తమను నమ్మించి  మోసం చేస్తున్నదని వాపోతున్నారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Several injured in violent clash outside delhi gurdwara
Police arrest producer director sivaramakrishna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles