Court summons those not in 2g case fir

court summons those not in 2G case FIR, court can summon those not in FIR, Court can summon those not in Charge sheet, CPC 319

court summons those not in 2G case FIR

2జి కేసు ఛార్జ్ షీట్ లో లేనివాళ్ళకి కోర్టు సమన్లు!

Posted: 01/10/2014 05:50 PM IST
Court summons those not in 2g case fir

2జి కుంభకోణంలో ఎఫ్ఐఆర్ లోను ఛార్జ్ షీట్ లోనూ లేని కొన్ని కార్పోరేట్ సంస్థలలోని వాళ్ళకి ఆ కేసు విచారిస్తున్న కోర్టు సమన్లు పంపించటం మీద అభ్యంతరాలు తెలుపుతూ సుప్రీం కోర్ట్ కి వెళ్ళారు.

దాని మీద మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ లోను ఛార్జ్ షీట్ లోనూ పేరు లేకపోయినా కోర్టు విచారణలో ఎవరి ప్రమేయమైనా ఆ కేసులో ఉన్నట్లు ఎవరి పేరైనా బయటకు వచ్చినట్లయితే, ఆ వ్యక్తికి సమన్లను పంపించే హక్కు కోర్టుకుందని సుప్రీం కోర్టు ఈరోజు వెల్లడిచేసింది. 

వాళ్ళ పేర్లను దర్యాప్తు సంస్థ సిబిఐ చార్జ్ షీట్ లో పేర్కొనకపోవటం, అయినా వాళ్ళకి సమనలు అందటంతో ఆ వ్యాపారవేత్తలు సుప్రీం కోర్టుని ఆశ్రయించగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 319 ప్రకారం ట్రయల్ కోర్టు విచారణలో పైకి వచ్చిన వాళ్ళకి సమన్లు పంపించవచ్చని తెలియజేసింది. 

అయితే దీని మీద ఇంకా అంతిమ తీర్పు వెలువడలేదు.  కానీ, ఛీఫ్ జస్టిస్ సదాశివన్ నాయకత్వంలో ఐదుగురు సభ్యలున్న సుప్రీం కోర్టు బెంచ్ ఈ రోజు పై విధంగా అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles