Samaikyandhra protests after sankranti

Samaikyandhra protests after sankranti, APNGOs Association President Ashok Babu,All party meet jan 14

Samaikyandhra protests after sankranti

మరోసారి సమైక్య పోరు- బంద్ లు ఆందోళనలు

Posted: 01/10/2014 04:21 PM IST
Samaikyandhra protests after sankranti

సంక్రాంతి తర్వాత ఉద్యమం ఊపందుకుంటుందని ఎపిఎన్జీవో ల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు.  వాటిలో భాగంగా ప్రకటించిన కార్యక్రాలు ఇవి-
జనవరి 17, 18 తేదీల్లో సీమాంధ్రలో బంద్.  20 న అసెంబ్లీ ముట్టడి. 

సంక్రాంతికి ముందు భోగి రోజున సీమాంధ్ర జిల్లాలలో అఖిలపక్షం సమావేశాలు జరుగుతాయి.  ఆ రోజు భోగి మంటలలో తెలంగాణా బిల్లుని దగ్ధం చేసే కార్యక్రమం ఉంటుంది.  ఆ సమయంలో ప్రజల సమక్షంలో ప్రజాప్రతినిధులు బిల్లుని ఓడిస్తామని భోగి మంటల సాక్షిగా వాగ్దానం చేసే కార్యక్రమం ఉంటుంది.

దేశ చరిత్రలోనే మొదటిసారిగా రాజకీయనాయకులను నియంత్రిస్తూ వారి వ్యూహంలా కాకుండా ఉద్యమ సంఘాల వ్యూహంగా సమైక్యాంధ్ర ఉద్యమం జరిగింది.  పార్టీలకు సంబంధం లేకుండా సొంత నియోజక వర్గానికి పోవటానికి సంశయిస్తూ వాళ్ళ దారికి అడ్డు తగలటం, వాళ్ళ ఇళ్ళ మీద దాడులు నిర్వహించటం చేసారు.  ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటానికి, సమైక్యాంధ్రకు మద్దతిస్తున్నామని ప్రకటించటానికి నాయకుల చాలా అగచాట్లు పడ్డారు. ఇంకా పడుతూనేవున్నారు. 

అయితే ఆ వేడి, దాని ప్రభావం చాలావరకు తగ్గినట్లుగా కనిపిస్తోంది.  స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్న ప్రజలు, సంఘాలు మరోసారి అలా వస్తాయా అన్నిది వేచిచూడవలసిందే. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles