Aap nationwide membership campaign

AAP nationwide membership campaign, Aam Admi Party membership, Arvind Kejriwal, AAP leader Gopal Rai, 2014 general elections

AAP nationwide membership campaign

మై భీ ఆమ్ ఆద్మీ కార్యక్రమంలో కోటి మంది సభ్యులు ?

Posted: 01/10/2014 03:59 PM IST
Aap nationwide membership campaign

ఢిల్లీలో అపూర్వ విజయం ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ స్థాయిలో కూడా ఆలోచింప జేసింది.  మరికొన్ని రాష్ట్రలలోను, 2014 సాధారణ ఎన్నికలలోనూ కూడా ఎన్నికలకు పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్న ఆఆపా జనవరి 26 రిపబ్లిక్ డే కల్లా దేశవ్యాప్తంగా ఒక కోటి మంది సభ్యులు చేరతారని ఆశిస్తున్నారు. 

ఆమ్ ఆద్మీ పార్టీలో చేరటానికి రుసుం లేదు.  ఈ విషయాన్ని మీడియా సమావేశంలో తెలియజేసిన ఆఆపా వ్యవస్థాపకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జనవరి 26 కల్లా కోటిమంది సభ్యులు చేరాలని ఆశిస్తున్నామని, ఆ తర్వాత కూడా సభ్యుల చేరిక ఉంటుందని అన్నారు. 

అంతకు ముందు పది రూపాయల రుసుం తీసుకుందామని అనుకున్న ఆఆపా దాన్ని రద్దు చేసి ఉచిత సభ్యత్వానికి ప్రకటన చేసింది.  దేశంలో మొదటిసారిగా ప్రారంభమైన ఈ విధమైన సభ్యత్వానికి కేవలం సెల్ ఫోన్ ద్వారా తెలియజేస్తే చాలు.  పేరు, ఎస్ టి ఢి కోడ్, పార్లమెంట్ నియోజకవర్గం వివరాలు ఇచ్చినట్లయితే వారికి సభ్యత్వ సంఖ్య కేటాయించబడుతుంది.  దాన్ని వాళ్ళకి తెలియపరచటం జరుగుతుంది.  లేదా ఫోన్ నుంచి మిస్డ్ కాల్ ఇచ్చినా సరిపోతుంది. 

ఢిల్లీ ఎన్నికల తర్వాత ఇప్పటికి మూడు లక్షల మంది ఫోన్ల ద్వారా సభ్యత్వాన్ని కోరారని ఆఆపా నాయకుడు గోపాల్ రాయ్ అన్నారు.  ఈ మై భీ ఆమ్ ఆద్మీ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యటం 2014 ఎన్నికల వ్యూహంలోని పెద్ద వాటిలో ఒకటని రాయ్ అన్నారు.  దీనితో మాకు ఎంత బలం ఏయే ప్రాంతాలనుంచి వస్తుందన్న అంచనా వేసుకోవటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

సభ్యత్వానికి డయల్ చెయ్యవలసిన ఫోన్ నంబర్- 07798220033

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles