It raids on maheshs 1 movie production company

IT rides on 14 reels, 1 nenokkadine, 14 reels entertainment, Maheshs 1 Movie Production Company, budget of 76 crores, 1- Nenokkadine office

IT team is digging out all the accounts relating to making, selling and promoting of the film One movie.

వన్ నిర్మాణ సంస్థ పై ఐటీ దాడులు

Posted: 01/08/2014 08:23 PM IST
It raids on maheshs 1 movie production company

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ పై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి పలు భారీ బడ్జెట్ సినిమాలతో పాటు, ప్రస్తుతం మహేష్ బాబు నటించిన ‘1’ సినిమా ను కూడా భారీ బడ్జెట్ తో నిర్మించారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో బంజారా హిల్స్ లోని ఆ సంస్థ కార్యాలయం పై దాడులు నిర్వహించడం టాలీవుడ్ లో కలకలం రేపుతుంది.

ఈ సినిమాకు 76 కోట్ల రూపాయలు ఖర్చుచేసినట్లు అంచనా. ఈ చిత్రంలోని కీలక భాగాలను దాదాపు 60 రోజుల పాటు లండన్‌లో చిత్రీకరించారు. అయితే నిర్మాణానికి అయిన ఖర్చుకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ సంస్థ పై దాడులు చేయడం చూస్తుంటే.... మరో నాలుగు రోజుల్లో విడుదల కానున్న ‘ఎవడు ’ఈ సినిమాను నిర్మించిన దిల్ రాజు ఆఫీస్ పై దాడులు నిర్వహించవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ సినీ జనాలు.  సుకుమార్ దర్శకత్వంలో ప్రిన్స్‌ మహేష్‌బాబు హీరోగా, క్రితి సానన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను ఈనెల 10 వ తేదీన గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles