Minister sailajanth complains on tdp ysrcp

Minister Sailajanth complains on TDP YSRCP, Assembly Affairs Minister Sailajanath, Sailajanath TDP YSRCP, Sailajanath requests coop in Assembly

Minister Sailajanth complains on TDP YSRCP

చర్చకు వస్తే తెదేపా వైకాపా జాతకాలు బయటపడతాయని- శైలజానాథ్

Posted: 01/06/2014 05:21 PM IST
Minister sailajanth complains on tdp ysrcp

తెలుగువారి భవిష్యత్తు దృష్ట్యా చర్చకు సహకరించండంటూ కొత్తగా శాసనసభ వ్యవహారాల శాఖను గ్రహించిన మంత్రి శైలజానాథ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు మీద చర్చకు అందరూ సహకరించాలని కోరారు.  

ఈరోజు ఉదయం మీడియా ప్రతినిధులతో తను చేపట్టిన మంత్రిత్వ శాఖకు పూర్తి న్యాయం చేస్తానని మాటిచ్చిన శైలజానాథ్ సాయంత్రం సిఎల్పీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బిల్లు చర్చకు వస్తే తమ జాతకాలు ఎక్కడ బయటపడతాయోనని తెలుగుదేశం పార్టీ వైయస్ కాంగ్రెస్ పార్టీలు భయపడుతున్నాయని వ్యాఖ్యానించారు.

పైకి రాష్ట్రం సమైక్యం ఉండాలని కోరుతున్నట్టుగా కనపడుతూ వెనకనుంచి రాష్ట్ర విభజనకు తోడ్పడుతున్న  ఆ రెండు పార్టీలూ బిల్లు మీద చర్చ జరగకుండా అడ్డు పడుతున్నాయని శైలజానాధ్ ఆరోపించారు.  

ముసాయిదా బిల్లు మీద సవరణలను ప్రతిపాదించటం జరుగుతుందని, వాటిని లిఖితపూర్వకంగా సమర్పించటం కూడా జరుగుతుందని, శైలజానాథ్ తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles