Fire in bibinagar sriam agro chemical lab

Fire in Bibinagar Sriam Agro Chemical Lab, Sriam Agro Bibinagar,

Fire in Bibinagar Sriam Agro Chemical Lab

బీబీనగర్ లో భారీ అగ్ని ప్రమాదం

Posted: 01/06/2014 04:05 PM IST
Fire in bibinagar sriam agro chemical lab

నల్గొండ జిల్లా బీబీనగర్ లోని శ్రియం ఆగ్రో కెమికల్ ల్యాబ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.  నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పటానికి ప్రయాస పడవలసివచ్చింది. 

భువనగిరి ఆర్డివో ఏవూరి భాస్కరరావు వేసిన ప్రాథమిక అంచనాలో నష్టం సుమారు 18 కోట్లు ఉండవచ్చని తేలింది.  పెద్ద ఎత్తున నింగికెగసిన మంటలు బీబీనగర్ స్థానికులను భయాందోళనలకు గురిచేసాయి.  అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.  భువనగరి రూరల్ సిఐ నరేందర్ గౌడ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 

మిసైల్ ట్యాంకర్ ని అన్ లోడ్ చేస్తున్న సమయంలో ఏర్పడ్డ స్పార్క్ వలన ఈ అగ్ని ప్రమాదం ఏర్పడిందని తెలుస్తోంది.  వెనువెంటనే ఉవ్వెత్తున లేచిన మంటలు, దట్టంగా కమ్ముకున్న పొగలతో ఆ చుట్టు పక్కల ప్రాంతమంతా భయోత్పాదనను కలిగించాయి.  

ప్రస్తుతం మంటలు నియంత్రణలోకి వచ్చాయని వార్త అందుతోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles