Arvind kejriwal takes oath as delhi cm

Arvind Kejriwal takes oath, Arvind Kejriwal, Aam Aadmi Party, AAP, India, Delhi, Chief Minister, Ramlila Maidan, Anna Hazare, Manish Sisodia

Aam Aadmi Party leader Arvind Kejriwal was on Saturday administered oath of office and secrecy as Delhi Chief Minister by Lt Governor Najeeb Jung.

కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రణాణ స్వీకారం

Posted: 12/28/2013 01:31 PM IST
Arvind kejriwal takes oath as delhi cm

దేశ రాజకీయాల్లో చరిత్ర స్రుష్టించి, అవినీతి రాజకీయ నాయకుల్ని చీపురుతో ఊడ్చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ...సమన్వయ కర్త అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు. ఈరోజు 11.55 నిమిషాలకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అరవింద్ కేజ్రీవాల్తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ కార్యకర్తలతో పాటు, ఢిల్లీ ప్రజలు భారీ సంఖ్యలో తరలి రాడంతో రాంలీలా మైదానం కిక్కిరిసి పోయింది. కేజ్రీవాల్ తో పాటు మనీశ్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్, సత్యేంద్ర జైన్, సోమ్ నాథ్ భారతిల చేత కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకారం అనంతరం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.... ఒక సామాన్యుడినైన నేను ఢిల్లీ ముఖ్యమంత్రిని అయ్యానంటే ఇది ఢిల్లీ ప్రజల చలువే అని, ఢిల్లీ ముఖ్యమంత్రిగా నీతివంతమైన పాలన అందిస్తానని, నేడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే నా పోరాటం ఆగిపోదని, ముందున్నది మహా సంగ్రామం అని, ఢిల్లీ ప్రజల అన్ని సమస్యలకు పరిష్కారం చూపేలా తన వంతు సాయం చేస్తానని అన్నారు. ఢిల్లీ రాజకీయాలతో పాటు, దేశ రాజకీయాలను కూడా శుద్ది చేసేందుకు క్రుషి చేస్తానని కేజ్రీవాల్ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles