సరిగ్గా గత రెండు నెలల క్రింద పాలెం వద్ద వొల్వో బస్సు మంటల్లో చిక్కుకొని 45 మంది సజీవ దహనం అయిన సంఘటన మరవక ముందే అనంతపురం జిల్లాలో మరో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. నాందేద్-బెంగుళూరు ఎక్స్ ప్రెస్ అనంతపురం జిల్లా కొత్త చెరువు వద్దకు రాగానే బి-1 ఏసీ భోగీలో మంటలు చెలరేగడంతో 23 మంది మరణించారు. మరికొంత మంది గాయ పడ్డారు.
ఈ ఘటనలో బి-1 భోగి మొత్తం దగ్నం అయింది. మొత్తం 64 మంది ప్రయాణికులు ఉండగా అందులో 23 మంది సజీవదహనం అయ్యారు. 15 మందికి పైగా గాయపడ్డారు. గాయ పడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో 21 మంది పెద్దవారు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంలో సజీవ దహనం అయిన వారి మృత దేహాలు గుర్తుపట్టకుండా కాలి మద్దయ్యాయి. ప్రమాదం లో మరణించిన వారిని బెంగుళూరు ఆసుపత్రికి తరలిస్తున్నారు.
ప్రమాద స్థలాన్ని మంత్రి రఘువీరా రెడ్డి సందర్శించి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకొని, క్షత గాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ప్రమాద వార్త తెలియగానే అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లను తీసుకెళ్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గాయాలతో తనూ శ్రీ అనే చిన్నారి బయట పడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మృతుల్లో ఇద్దరు అధోని వాసులు బసవరాజు, సర్వమంగళంగా గుర్తించారు.
గాయపడిన వారిని పుట్టపర్తి, అనంతపురం జిల్లా ఆసుపత్రిల్లో చికిత్సను అందిస్తున్ానరు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. బాధితులను తక్షణమే ఆదుకోవాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి మల్లిఖార్జున ఖార్గేను, ఈ ఘటన పై విచారణ చేపట్టాలని ఫోన్లో ఆదేశించారు.
ఈ ప్రమాదంలో గాయ పడిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. తీవ్రంగా గాయన పడిన వారికి రూ. లక్ష, గాయపడిన వారికి 50 వేల చొప్పున పరిహారం అందిస్తామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more