Bollywood actor farooq sheikh pass away

Veteran actor Farooq Sheikh, Bollywood actor Farooq Sheikh , Chashme Buddoor, club 60 movie,Farooq Sheikh pass away, Farooq Sheikh died

Veteran actor Farooq Sheikh passed away. The 65-year-old Bollywood actor suffered a fatal heart attack on late Friday night.

ఫారూఖ్ షేక్ దుబాయ్ లో కన్నుమూత

Posted: 12/28/2013 04:01 PM IST
Bollywood actor farooq sheikh pass away

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ప్రముఖ నటుడ్ని కోల్పోయింది. ప్రముఖ నటుడిగా పేరు తెచ్చుకున్న షారూఖ్ షేక్ (64) గుండె పోటుతో దుబాయ్ లో కన్నుమూశారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయనకు అక్కడ గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఫారూఖ్ స్వస్థలం గుజరాత్ రాష్ట్రంలోని బరోడా జిల్లా అమరోలి గ్రామం. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఈయన ఇటీవలి కాలంలో ‘చష్మే బద్దూర్,  ‘సాథ్ సాథ్' లాంటి సినిమాలతో పాటు అనేక బాలీవుడ్ చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ నటుడిగా చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. దుబాయ్‌లో ఫార్మాలిటీస్ పూర్తైన అనంతరం ఆయన పార్థివదేహాన్ని ముంబైకి తరలించనున్నారు. రీసెంటుగా ఫారూక్ ‘క్లబ్ -60’ చిత్రంలో నటించాడు.

ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఫారుఖ్ మృతి పట్ల బాలీవుడ్‌లోని ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన ఒక జంటిల్మెన్ అద్భుతమైన సహనటుడు అని బిగ్‌బీ అమితాబచ్చన్ కొనియాడారు. ఫారూఖ్ మృతి బాలీవుడ్‌కు తీరని లోటు అని డైరెక్టర్ శేఖర్ కపూర్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles