Devyani was granted personal exemption

దేవయానికి వ్యక్తిగత హాజరీ నుంచి మినహాయింపు

Posted: 12/23/2013 04:48 PM IST
Devyani was granted personal exemption

భారత దౌత్యవేత్త దేవయానికి వ్యక్తిగతంగా తన కేసులో హాజరు కాకుండా మినహాయింపు లభించింది. అమెరికాలో వీసా నియమాల ఉల్లంఘన ఆరోపణ ఎదుర్కుంటున్న దేవయాని ఖోబ్రాగడె ని దౌత్తవేత్త స్థానం నుంచి ఐరాస దౌత్యబృందానికి బదిలీ చెయ్యటంతో ఆమెకు కేసు విచారణలో వ్యక్తిగతంగా హాజరవాల్సిన తిప్పలైతే తప్పాయి కానీ ఆమె మీద నేరాన్ని మాత్రం ఎత్తివేయటానికి అమెరికా ప్రభుత్వం అంగీకరించలేదు.

 

దేవయాని తన ఇంట్లో పనికి పెట్టుకున్న సంగీతా రిఛర్డ్ విషయంలో వీసాలో తప్పు సమాచారం ఇచ్చారని, ఆమె కు అమెరికా నియమాల ప్రకారం వేతనం చెల్లించలేదని, రోజుకి నియమిత కాలం కంటే ఎక్కువ కాలం పనిచేయించుకున్నారని వచ్చిన ఆరోపణలో అరెస్టై బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఆమె హోదాను ఐరాస బృందానికి మారుస్తూ ఆమెకు కేసు విచారణ నుంచి మినహాయింపు కోరగా, నేరం అంతకు ముందే జరిగింది కాబట్టి ఇప్పుడు హోదాలో మార్పు వచ్చినా దాన్ని పరిగణనలోకి తీసుకోమని అమెరికా ప్రభుత్వం తేల్చి చెప్పింది.

 

అయితే ఆమె వ్యక్తిగతంగా హాజరు కావటం నుంచి మినహాయింపు మాత్రం ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం దేవయానికి ఉన్న హోదా దృష్ట్యా ఆమె ఏ కేసు విచారణలోనూ హాజరవవలసిన అవసరం లేదు. కానీ నేరారోపణ ముందుగానే జరిగింది కాబట్టి కేసు నుంచి మాత్రం ఇమ్యూనిటీ లభించదని అమెరికా అధికారులు చెప్పారు. అయితే ఆమెను మానసికంగా వేధించారని, ఆమె కేసును ఉపసంహరించుకోవాలని వైట్ హౌస్ కి ఇండియన్ అమెరికన్ బృందం పిటిషన్ దాఖలు చెయ్యటం జరిగింది.

 

దౌత్యవేత్తగా ఇప్పటివరకు చైనాలో సేవలందిస్తున్న ఎస్ జయశంకర్ ప్రస్తుతం దేవయాని స్థానంలో బాధ్యతలు చేపట్టారు.

 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles