We can get away with anything us

Devyani Khobragade, Only US diplomats get immunity, Immunity to Joshua Walde, Immunity to Raymond Allen Davis, Devyani case

US can get away with any crime

మేమేం చేసినా చెల్లుతుంది అనే అమెరికా

Posted: 12/20/2013 06:10 PM IST
We can get away with anything us

పాకిస్తాన్ లో జరిగిన సంఘటన చూస్తే అమెరికా ప్రభుత్వం ఏం చేసినా అది చెల్లిపోతుంది కానీ వేరే ఎవరూ చెయ్యగూడదన్న వాళ్ళ వాదన అర్థమౌతుంది. 

అది 2011 వ సంవత్సరం, తేదీ జనవరి 27.   రేమాండ్ అల్లెన్ డేవిస్ అనే అతను లాహోర్ లో ఇద్దరు సాయుధ పోలీసులను కాల్చి చంపాడు.  అతనేమీ దేవయాని హోదా అయిన డెప్యూటీ కాన్సుల్ జనరల్ కి తగినవాడేమీ కాదు.  కేవలం ఒక ప్రైవేట్ కంపెనీ లో పనిచేస్తూ పాకిస్తాన్ లో అమెరికా ప్రభుత్వపు సిఐఏ తరఫున చేసిన పని అది.  డేవిస్ ఉపయోగించిన వాహనంలో లభించిన ఎన్నో పేర్లతో అతని ఐడి కార్డ్ లు, కెమేరాలోని వివిధ ఫొటోల వలన అతను ఒక అమెరికన్ గూఢచారి అని బయటపడ్డా, మసి పూసి మారేడు కాయ చేసినట్లుగా, అతనికి దౌత్యహోదా కల్పించి, పాకిస్తాన్ కోర్టుకి ఆ కేసు పోకుండా కట్టుదిట్టం చెయ్యగల దిట్టలు అమెరికన్ అధికారులు.  స్థానికంగా వచ్చిన వ్యతిరేకతను సైతం ఎదుర్కొని 2.4 డాలర్లను కక్కి డేవిస్ ని విడిపించుకొచ్చారు.  దరిమిలా ఆ చనిపోయినవాళ్ళ కుటుంబ సభ్యులుకూడా మాయమైపోయారు. 

మరో సందర్భంలో కెన్యాలో పనిచేసే తక్కువ స్తాయి అమెరికన్ దౌత్యవేత్త జోషువా వాల్డేని కూడా అలాగే రక్షించి తీసుకొచ్చారు.  వాల్డే తను నడుపుతున్న ఎస్ యు వి తో ముందు వెళ్తున్న బస్ ని ఢీకొనగా ఒక మనిషి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.  చనిపోయిన మనిషి కుటుంబ సభ్యులకు కనీసం పరిహారం కూడా చెల్లించకుండా దౌత్యవేత్తలకు లభించే మినహాయింపుని ఉపయోగించుకున్నారు. 

అమెరికన్ వాసులు విదేశాలలో ఏం చేసినా సరే వాళ్ళను సగౌరవంగా తమ దేశానికి తిరిగి తెచ్చుకుంటారు.  విదేశీయులు తమ దేశస్తులను కోర్టు విచారణకు తీసుకెళ్ళనివ్వరు.  అమెరికన్ దౌత్యవేత్తలకు మాత్రమే ఇతర దేశాలలో నిబంధనలు వర్తించవన్నమాట.  ఇతర దేశాల దౌత్యవేత్తలకు మాత్రం వాళ్ళ దేశంలోని చట్టాలు వర్తిస్తాయి. 

అమెరికా ఏదో శరణార్థుల శిబిరమైనట్లు, భారత దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళే వాళ్ళ మీద ఎటువంటి జులుంనైనా చెయ్యవచ్చన్నది అమెరికా భావన.  దౌత్యవేత్తలు, రాజకీయ నాయకులే కాదు సాధారణ నాగరికులను సైతం వదిలిపెట్టరని షారుఖ్ ఖాన్ ని సెక్యూరిటీ చెక్ లో వేధించిన సంఘటనతో రుజువౌతుంది. 

నిదానంగా సాత్వికంగా పోయే భారత ప్రభుత్వమన్నా భారతదేశ వాసులన్నా అమెరికాకు చులకనే అని ఈ సంఘటనల ద్వారా తెలుస్తోంది. 

దేవయాని విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరుతో భారత దేశవాసులు, కొందరు రాజకీయ నాయకులు స్పందించినా, ఢిల్లీ లో అమెరికన్ దూతావాసం ముందు ఉన్న బ్యారికేడ్లను తొలగించినా, వెంటనే చప్పబడ్డ మన ప్రభుత్వం తరఫున విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, అమెరికా దేశంతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా ఆలోచించి దేవయాని విషయంలో పరిష్కార మార్గం కనిపెట్టాలని అనటం చేతకాని తనం అనిపించుకుంటుంది కానీ సాత్వికం అని మాత్రం అనిపించుకోదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yerram naidu comments on congress leaders
Nd tiwari still wants to be active in politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles