Yerram naidu comments on congress leaders

Yerram naidu comments on congress leaders, TDP, Chanra Babu Naidu, Padayatra, Congress Party, Minister, Telangana,

Ymerra naidu comments on congress leaders

Ymerra.gif

Posted: 10/02/2012 11:10 AM IST
Yerram naidu comments on congress leaders

Yerram naidu comments on congress leaders

తెలుగుదేశం పార్టీ  సీనియర్ నాయకులు కాంగ్రెస్ నేతలకు సవాల్ విసురుతున్నారు. చంద్రబాబు పాద యాత్ర చేస్తున్న సందర్భంలో  ఆ పార్టీ నాయకులు  రెచ్చిపోయిన కాంగ్రెస్ మంత్రుల పై విమర్శలు చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు సన్నాసులు కాబట్టే తెలంగాణ సమస్యపై అటో, ఇటో తేల్చటానికి అధిష్ఠానంపై అఖిలపక్షం ఏర్పాటుకు ఒత్తిడి తీసుకురావటంలేదని టీడీపీ నాయకుడు కింజారపు ఎర్రన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే సోనియా, ప్రధాని మన్మోహన్‌లతో మాట్లాడి అఖిలపక్ష సమావేశానికి ముహూర్తం నిర్ణయించాలని కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు సవాల్ విసిరారు. చంద్రబాబు తలపెట్టిన మీకోసం.. వస్తున్నా పాదయాత్ర సందర్భంగా ఆయనకు ఆరోగ్యం చేకూరాలని కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా.. గొల్లపూడి నుంచి దుర్గగుడి వరకు పాదయాత్ర, సర్వమత ప్రార్థనల కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎర్రన్నాయుడు హాజరయ్యారు.ముఖ్య నాయకులతో వందల సంఖ్యలో వచ్చిన కార్యకర్తలతో దాదాపుగా మూడు కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొన్నారు.

భవానీపురం దర్గాలోనూ, పున్నమిహోటల్ ఎదురుగాఉన్న చర్చిలోనూ ప్రార్థనలు జరిపారు. దుర్గగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రన్నాయుడు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం తాము ఎలాంటి ఉద్యమాలు తాము నిర్వహించిందీ అందరికీ తెలిసిన విషయమేనన్నారు. ఎంపీలు లగడపాటి, కావూరు సమైక్యాంధ్ర కావాలని అంటే, వసంత నాగేశ్వరరావు మాత్రం జై ఆంధ్రా కావాలని అంటారని, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక తెలంగాణ అంటున్నారని పేర్కొన్నారు. ఇన్ని వైరుధ్యాలు ఉన్న నేపథ్యంలో, మేం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కోరటంలో తప్పేముందని ప్రశ్నించారు. లగడపాటి దీనిపై సోనియాకు, మన్మోహన్‌కు లేఖ రాయకుండా చంద్రబాబుకు లేఖ రాయటంలోని ఆంతర్యమేమిటో అందరికీ తెలుసునన్నారు.రాష్ట్రం అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతోందని, వాస్తవాలు ప్రజలకు తెలియచెప్పటానికి, గాడితప్పిన రాష్ట్రాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకురావటానికి, రాష్ట్ర ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపటానికి చంద్రబాబు పాదయాత్ర చేపడితే దానిని కూడా విమర్శిస్తున్నారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసినప్పుడు విమర్శించనివారు ఇప్పుడు బాబు పాదయాత్రకు విమర్శలు ఎందుకు చేస్తున్నారో అందరికీ తెలుసునన్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాలకు నాగార్జునసాగర్ నుంచి నీళ్లిప్పించలేని దద్దమ్మలు, అసమర్థులంతా ఉత్తరకుమారుల మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. సమైక్యాంధ్ర, తెలంగాణ, జైఆంధ్రా ఉద్యమాలతో ప్రజలను గందరగోళ పెడుతున్నారని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles