Ap high court got shocks ramoji rao

eenadu head ramoji rao, AP high court, 17lakhs rent per month, vizag eenadu office, greater vizag corporation, ap high court

AP high court issued orders to ramojirao 17lakhs rent per month for vizag eenadu office building owner.

రామోజీగారు అద్దె చెల్లించాల్సిందే

Posted: 12/20/2013 09:19 AM IST
Ap high court got shocks ramoji rao

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు చిక్కుల్లో పడ్డాడు. ప్రముఖ వ్యాపారవేత్తగా పేరొందిన రామోజీరావు చిన్న స్థల వివాదంలో ఇరుక్కొని బయటకి రాలేక నానా ఇబ్బందులు పడుతున్నాడు. విశాఖ పట్టణంలోని సీతమ్మధార లోని ఈనాడు భవన కేసు విచారణలో తాజాగా ఆయనకు హైకోర్టు నుండి చుక్కెదురయింది. ఈనాడు కార్యాలయం స్థల యజమాని మంతెన ఆదిత్య కుమారవర్మ ఇటీవల హైకోర్టులో దాఖలు చేసిన వివిధ పిటిషన్లను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి రామోజీరావుకు గట్టి షాక్ ఇచ్చారు.

ఈనాడు కార్యాల యం కేసు విచారణ పూర్తయ్యేవరకూ కొనసాగాలంటే ప్రభుత్వ విలువ ప్రకారం నెలకు రూ. 17 లక్షలు చొప్పున అద్దె చెల్లించాలని ఈనాడు యజమాని రామోజీరావుని హైకోర్టు ఆదేశించింది. అలాగే గత బకాయిలు రూ. 2.06 కోట్లను వచ్చే నెల 10వ తేదీలోగా చెల్లించాలని స్పష్టం చేసింది. నెల రోజుల్లో భవనం ఖాళీ చేయాలని ఆదేశిస్తూ అద్దె నియంత్రణ న్యాయస్థానం (ఆర్‌సీసీ) తీర్పు ఇచ్చింది.

దీనిపై రామోజీరావు విశాఖలోని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో అప్పీలు చేయగా... ఆర్‌సీసీ ఉత్తర్వులపై కోర్టు స్టే ఇచ్చింది. చిన్న స్థలం కోసం రామోజీ ఇంతగా వార్తల్లోకి ఎక్కెడం బాగోలేదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles