Devyani case india demands us apology

Devyani case , ministry of external affairs, Devyani Khobragade, visa fraud case, Preet Bharara

The Indian government has made it clear that the case against Devyani Khobragade has to be dropped...

దేవయాని విషయంలో క్షమాపణలు చెప్పం : అమెరికా

Posted: 12/20/2013 12:20 PM IST
Devyani case india demands us apology

అగ్రరాజ్యం అమెరికాలో అరెస్టు అయిన భారత దౌత్యవేత్త దేవయాని విషయం గత కొన్ని రోజులుగా రెండు దేశాల మధ్య ప్రకంపనలు స్రుష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈమె అరెస్టు పై భారత్ నుండి ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తడమే కాకుండా, కుట్ర పకారమే ఈమె పై కేసు పెట్టారని, దానిని వెంటనే ఉపసంహరించుకోవాలని, చేసిన తప్పుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

దీని పై స్పందించిన అగ్రరాజ్యం దేవయానిపై నమోదైన కేసును ఉపసంహరించే ప్రసక్తే లేదని, ఈ కేసు చట్ట ప్రకారం కొనసాగుతుందని అగ్రరాజ్యం అమెరికా స్పష్టం చేసింది. అలాగే, భారత్ డిమాండ్ చేస్తున్నట్టుగా క్షమాపణ చెప్పబోమన్నారు. అంతేకాకుండా, దేవయానిపై వచ్చిన ఆరోపణలను తమ దేశంలో తీవ్రంగా పరిగణిస్తామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మేరీ హార్ఫ్ తెలిపారు.

అందువల్ల కేసు విచారణ తమ దేశ చట్టాల మేరకు కొనసాగుతుందని చెప్పారు. అమెరికా తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నిరసనను చేపట్టింది. బేగంపేటలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో  తెలుగు తమ్ముళ్ళను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. దేవయానికి న్యాయం చేసేంత వరకు పోరాటం చే్స్తామని, తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles