Cyclone lehar weakens

Cyclone Lehar weakens, Cyclone Lehar to Hit Andhra Pradesh, Andhra cyclone, Cyclonic Lehar, IMD alert, India Meteorological Department

Cyclone Lehar weakens, Cyclone Lehar to Hit Andhra Pradesh

భయపెట్టి.. బందరు వద్ద ప్రశాంతంగా వెళ్లిపోయింది.

Posted: 11/28/2013 09:30 PM IST
Cyclone lehar weakens

సూపర్ సైక్లోన్‌గా ప్రళయం సృష్టిస్తుందని భావించిన లెహర్ తుపాను మరింతగా బలహీనపడి తుదకు ఈరోజు  మధ్యాహ్నం 2 గంటలకు బందరు వద్ద తీరం దాటింది. అయితే ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా సంభవించొచ్చని భావించిన అధికారులు తుపాను ప్రభావిత మండలాలైన కృత్తివెన్ను, బందరు, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లోని లోతట్టు ప్రాంతాల నుంచి దాదాపు 7వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

అయితే లెహర్  తుఫాను రాకపై సర్వత్రా అప్రమత్తమైన ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మచిలీపట్నం వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ పేర్కొనడంతో ఆర్మీ బలగాలతో పాటు ఎన్‌డిఆర్ఎఫ్ బృందాలు బందరుకు చేరాయి. అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఎలాంటి విపత్కర పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధం కాగా, లెహర్ క్రమేణా బలహీనపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.

కృష్ణా జిల్లా కలెక్టర్ రఘునందనరావు తీరప్రాంత మండలాల ప్రత్యేకాధికారులతో సమీక్ష నిర్వహించి తుఫాను పరిస్థితిపై ఆరా తీశారు. హెలెన్ తుపానుతో దాదాపు మూడు లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతినగా, లెహర్ తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలు మరింత నష్టదాయకమని రైతులు భావిస్తున్నారు.  మొత్తానికి అందరిని భయపెట్టి  .. బందరు వద్ద ప్రశాంతంగా తీరం దాటి వెళ్లిపోయింది లెహర్ . అయితే రానున్న 24 గంటల్లో  భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పటం జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles