Kondru murali fire on congress leaders

kondru murali fire on congress leaders, congress party, minister ganta srinivasa rao, mp lagadapati rajagopal , ap bifurcation, sonia gandhi, botsa satyanarayana,

kondru murali fire on congress leaders

ఈ ఇద్దరి పై వెంటనే అధిష్టానం చర్యలు తీసుకోవాలి ?

Posted: 11/28/2013 05:09 PM IST
Kondru murali fire on congress leaders

మంత్రి గంటా శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ల పై వెంటనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్య తీసుకోవాలని మంత్రి కొండ్రు మురళి తెలిపారు. రాష్ట్ర విభజన అంశంలో అధిష్టానం చెప్పినట్లే నడుచుకుంటామని మంత్రి కొండ్రు మురళి స్పష్టం చేశారు. అధిష్టానంకు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని ఆయన బుధవారమిక్కడ హెచ్చరించారు.

 

ఒకవేళ విభజన అనివార్యమైతే సీమాంధ్రకు అన్యాయం జరగదని కొండ్రు తెలిపారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు, లగడపాటి రాజగోపాల్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా సమైక్యాంధ్రకు మద్దతుగా గంటా శ్రీనివాసరావు, లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. విభజన విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని వారు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు.

 

నిన్న పీసీసీ ఛీప్ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ పై కామెంట్ చేసే నాయకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పటం జరిగింది. అయితే వెంటనే.. మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించి.. పార్టీలోని అందరి నాయకులు పై చర్య తీసుకోవాలని బొత్స కామెంట్ కు కౌంటర్ వేయటం జరిగింది. దీంతో సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు మద్య ఎన్ని విభేదాలు ఉన్నాయో ఇట్టే తెలిసిపోతుంది. గాంధీ భవన్ సాక్షిగా కాంగ్రెస్ నాయకులు ఒకరి ఒకరు విమర్శలు చేసుకోవటం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు. ఇకనైన విమర్శలు ఆపి , ప్రజా సమస్యలను పట్టించుకోవాలని పార్టీ పెద్దలు కొరుతున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles