Fake passport case seven year jail to abu salem

Underworld don Abu Salem, Abu Salem,Central Bureau of Investigation,Gangster,Passport, Seven-year jail, 2001 Fake passport case.

Underworld don Abu Salem has been sentenced to seven years in jail in the 2001 fake passport case by a special Central Bureau of Investigation (CBI) court in Hyderabad.

మాఫియా డాన్ కి ఏడేళ్ళ జైలు శిక్ష

Posted: 11/28/2013 12:21 PM IST
Fake passport case seven year jail to abu salem

మాఫియా డాన్ అబూ సలేం నకిలీ పాస్ పోర్టు వ్యవహారానికి సంబంధించి నాంపల్లి క్రిమికల్ కోర్టు నేడు తుది తీర్పు ఇచ్చింది. పన్నేండేళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది. నకిలీ పాస్ పోర్టు వ్యవహారానికి సంబంధించి ఈయన పై 120 (బి), 490, 471 సెక్షన్లతో కేసు నమోదు చేశారు.

ఇప్పటికే గత ఆరు సంవత్సరాల నుండి జైలులో శిక్షను అనుభవిస్తున్న అబూసలేంను ఈ సెక్షన్ల ప్రకారమే దోషిగా నిర్ధారించి తీర్పును వెలువరించారు. కోర్టు విధించిన శిక్షాకాలనికి మరో ఏడాది మాత్రమే మిగిలింది. గతంలో సినీ నటి మోనికా బేడీ కూడా నకిలీ పాస్ పోర్టు కేసుకు సంబంధించి మూడేళ్ళ శిక్షను అనుభవించి బయటకి వచ్చింది. కోర్టు కేసు వెలువరించిన తరువాత అబూ సలేం ను పోలీసులు థానే జైలుకు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles