Marri shashidhar reddy meet on shinde

marri shashidhar reddy meet on shinde, Marri Shashidhar Reddy with Media after Meeting with Shinde, congress party, telangana issue, trs party, telangana state, ap bifurcation, shinde, 2014 election, sonia gandhi,

marri shashidhar reddy meet on shinde, Marri Shashidhar Reddy with Media after Meeting with Shinde

అర్థరాత్రి తెలంగాణ వస్తే.. అంతా మారిపోతుంది : రెడ్డిగారు

Posted: 11/26/2013 03:11 PM IST
Marri shashidhar reddy meet on shinde

అర్థరాత్రి తెలంగాణ వస్తే.. అంతా మారిపోతుందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు, సనత్ నగర్ ఎమ్మెల్యే మర్రి శశిదర్ రెఢ్డి అంటున్నారు. ఈరోజు ఆయన తెలంగాణ నేతలతో కలిసి కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటి కావటం జరిగింది. ఈ భేటి సమయంలో షిండేతో మర్రి శశిదర్ రెడ్డి కొన్ని డిమాండ్స్ ను వినిపించటం జరిగింది.

 

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ లో అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాలని మర్రి శశిదర్ రెడ్డి కోరారు. అంతేకాకుడా చిన్న రాష్ట్రాల్లో రాజకీయ అస్థిరత్వాన్ని పొగొట్టడానికే ఈ ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాడు పది జిల్లాలతో కూడిన హైదరాబాద్ రాజధానిగా ఉన్న తెలంగాణ కోరుతున్నామని మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేయటం జరిగింది. అయితే షిండే భేటి అనంతరం మర్రి శశిదర్ రెడ్డి మాట్లాడుతూ.. అర్థరాత్రి తెలంగాణ వస్తే.. అంతా మారిపోతుందని ఆయన అన్నారు.

 

ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ముందుగానే అసెంబ్లీ స్తానాలు పెంచాలని షిండేను కోరినట్లు మర్రి చెప్పటం జరిగింది. అంతేకాకుండా అసెంబ్లీ స్థానాలు పెంచాలనే ప్రతిపాదనపై టీఆర్ఎస్ లోని ఓ ముఖ్యనేత తనతో మాట్లాడి.... మద్దతు తెలిపారన్నారు. కాంగ్రెస్ పార్టీతో సహా తెలంగాణలోని అన్ని పార్టీలు ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నాయన్నారు. 2014 ఎన్నికల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయటం సాధ్యమేనని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles