Hyderabad to be union territory for 2 years

hyderabad to be union territory for 2 years, hydrerabad union territory, State Bifurcation,Hyderabad UT,sonia gandhi,gom

hyderabad to be union territory for 2 years, hydrerabad union territory, State Bifurcation,Hyderabad UT,sonia gandhi,gom

రెండేళ్ళ పాటు హైదరాబాద్ యూటీ

Posted: 11/26/2013 10:23 AM IST
Hyderabad to be union territory for 2 years

శీతాకాల సమావేశాలు సమీపిస్తుండటంతో రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో పెట్టేందుకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తుంది. సీడబ్ల్యూసీ తీర్మానంలో పదేళ్ళ పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ళ పాటు ఉంటుందని ప్రకటించిన తరువాత తెలంగాణ ప్రాంత నేతల నుండి తీవ్రమైన వ్యతిరేకత రావడం జరిగింది.

తాజాగా కేంద్రం హైదరాబాద్ ను రెండేళ్ళ పాటు యూటీ చేసి ప్రస్తుతం ఉన్న సమస్యల నుండి గట్టెక్కాలనే ఆలోచనలో అధినేత్రి సోనియా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయం పై ఆమె  నిశితంగా పరిశీలిస్తోంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధినంతటినీ రెండేళ్ల పాటు యూటీ చేసే విషయంపై తలెత్తే ఇబ్బందులేమిటో తెలుసుకుని, వాటిని అధిగమించేందుకు తగిన ప్రతిపాదనలు చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి (జీవోఎం) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అత్యవసరంగా భేటీ అయిన సమావేశంలో సూచించింది.

ఇక ఇటు సీమాంధ్ర కేంద్ర మంత్రులు అయిన  జేడీ శీలం, కావూరి సాంబశివరావు లాంటి వాళ్ళు హైదరాబాద్ ను తాత్కాలిక యూటీ చేస్తే పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామని, సీమాంధ్ర మంత్రుల్ని ముఖ్యమంత్రి కిరణ్ ని కూడా విభజనకు ఒప్పిస్తామని కూడా అంటుండటంతో కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తుంది. మరి ఈ ప్రతిపాదనకు తెలంగాణ వాదులు ఒప్పుకుంటారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles