Vatti vasanth kumar questions to gom

Vatti vasanth Kumar Questions to GOM, GOM Meeting, minister Vatti Vasant Kumar, Tourism Minister Vatti Vasant Kumar

Vatti vasanth Kumar Questions to GOM

జీవోఎం ముందు వట్టి డిమాండ్స్ చిట్టా

Posted: 11/13/2013 02:59 PM IST
Vatti vasanth kumar questions to gom

హెచ్ ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) చేయాలని రాష్ట్ర మంత్రి వట్టి వసంతకుమార్ మంత్రుల బృందానికి విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఆయన మంత్రుల బృందం (జీవోఎం) ఎదుట తన డిమాండ్ చిట్టా విప్పారు. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వెనకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని జీవోఎంను కోరారు.

 

హైదరాబాద్ శాంతిభద్రతలు కేంద్రం చేతిలో ఉంచాలని, హైదరాబాద్ రెవెన్యూ ఆదాయంలో 60 శాతం తమకు ఇప్పిస్తారని జీవోఎంపై ప్రశ్నల వర్షం కురిపించారు. 1956కు ముందు ఉన్న రాష్ట్రాన్ని తమకు ఇవ్వగలుగుతార అని జీవోఎంను ప్రశ్నించారు.

 

తమ పార్టీ ఆదేశాల మేరకే నివేదికలిచ్చామని వట్టి ఈ సందర్బంగా గుర్తు చేశారు. తాను సంధించిన ప్రశ్నలను పరిష్కరించి ఆ తర్వాత విభజనపై ముందుకు వెళ్లాలని వట్టి వసంతకుమార్ జీవోఎంకు సూచించారు.

 

సీమాంధ్రలో పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోడానికి ప్రత్యేకంగా గ్యాస్ కేటాయింపులు ఇవ్వగలరా అని వట్టి అడిగారు. హెచ్ఎండీఏను యూటీ చేయాలని డిమాండ్ చేశారు. 1956కు ముందు సీమాంధ్రలోని ప్రాంతాలను తెలంగాణ నుంచి విడదీయాలన్నారు. దమ్ముగూడెం ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేయాలని కోరారు.

 

అధికారులతో వేసే కమిషన్లతో ప్రయోజనం ఉండదన్నారు. నదీజలాలపై ఎగువ రాష్ట్రాలు మెలికపెడుతున్నాయని తెలిపారు. విభజన జరిగితే యువత విద్య, ఉద్యోగపరంగా నష్టపోతుందన్నారు. సమస్యలకు పరిష్కారం చూపించాక విభజనపై మాట్లాడతామని మంత్రి వట్టి వసంత్‌కుమార్ తెలిపారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles