Kcr secret meet with shinde

kcr secret meet with shinde, KCR Secret Meeting with shinde, Sushil Kumar Shinde, GOM ministers meeting, telangana issue,

kcr secret meet with shinde, KCR Secret Meeting with shinde

షిండేతో కేసిఆర్ ఇరవై నిమిషాలు

Posted: 11/13/2013 10:23 AM IST
Kcr secret meet with shinde

తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు, ఆ పార్టీ సెక్రెటరీ జనరల్‌ కె.కేశవరావు ఢిల్లిలో అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేను కలిసి రహస్య చర్చలు జరపడం రాజకీయ వర్గాల్లో మరో చర్చకు తెరలేపింది. రాష్ట్ర విభజన అనంతరం సమస్యలు, పరిష్కారాల కోసం కేంద్ర మంత్రుల బృందం ఐదు పార్టీలతో సమావేశాలు నిర్వహించింది. అయితే సాయంత్రం అన్ని పార్టీలు అభిప్రాయం చెప్పిన తర్వాత జీవొఎంలోని సభ్యులు ఆంటోనీ, జైరాం రమేష్‌ వంటివారందరూ వెళ్ళి పోయాక కేసీఆర్‌, కేకేలు 20 నిమిషాలపాటు షిండేతో చర్చలు జరిపారు.

 

అయితే ఇటీవల కాలం లో కాంగ్రెస్‌ పార్టీలో తెరాస విలీనం ఉండదని వచ్చే ఎన్నికల్లో ఒంటరిపోరు చేస్తామంటూ పార్టీ అంతర్గత సమావేశాల్లో కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ మాట మార్చారు. కాంగ్రెస్‌లో విలీనం కాదంటూ చేస్తున్న ప్రకటనలపై మీడియా అడిగిన ప్రశ్నలకు కేసీఆర్‌ స్పందిస్తూ ఏవో పత్రికలు ఏవో రాసుకుంటే నేను బాధ్యుడినా అంటూ ఎదురు ప్రశ్న వేశారు.

 

దీంతో షిండేతో సమావేశమైన సందర్భంగా తెరాస ఇటీవల వ్యవహరిస్తున్న తీరుపైనే చర్చ జరిగినట్టు తెలిసింది. తెరాస తమ పార్టీలో విలీనమైతేనే రాష్ట్ర ఏర్పాటుకు తాము ముందుకు వచ్చామని, ఇప్పుడు మాట మారిస్తే ఎలా అంటూ షిండే కేసీఆర్‌ను ప్రశ్నించినట్టు తెలిసింది. దీనికి కెసిఆర్‌ కూడా సుదీర్ఘమైన వివరణ ఇచ్చినట్టు సమాచారం. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి నిత్యం విలీన అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వారి మాటలను తిప్పికొట్టేందుకే అలా మాట్లాడాల్సి వస్తుందని వివరణ ఇచ్చినట్టు సమాచారం.

 

హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రులలో ఎటువంటి భయాందోళనలు లేవని, కేవలం కొంతమంది నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ భూతద్దంలో చూపుతున్నారని హైదరాబాద్‌పై ఎటువంటి ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా కేసీఆర్‌ షిండేకు చెప్పినట్లు సమాచారం. హైదరాబాద్‌ రాజధానిగా పది జిల్లాల తెలంగాణను ఏర్పాటు చేస్తేనే ప్రజలు, తాము ఒప్పుకుంటాం తప్ప మరే ప్రత్యామ్నాయానికి అంగీకరించేది లేదని కేసీఆర్‌, హోంమంత్రికి స్పష్టం చేసినట్లు సమాచారం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles