Ak antony asks armed forces to be ready

AK Antony asks armed forces to be ready, Defence minister AK Antony, Defence minister A K Antony

AK Antony asks armed forces to be ready

ఆంధ్రప్రదేశ్ కి ఏకే ఆంటోనీ సైన్యం

Posted: 10/11/2013 04:24 PM IST
Ak antony asks armed forces to be ready

ఆంద్రప్రదేశ్  లో ఇప్పటికే  పోలీసులు  బలగాలు  మొహరించి ఉన్నాయి. అయితే  ఇప్పుడు  కొత్త   రక్షణ శాఖ మంత్రి    ఏకే ఆంటోనీ   ఆంద్రప్రదేశ్ కు  సైన్యాన్ని దింపే ఏర్పాట్లో  చాలా బీజీగా ఉన్నారు.   అయితే  సమైక్యాంద్ర కోసం  నడుస్తున్న   ఉద్యమం కోసం కాదులేండి. గత  రెండు రోజుల నుండి  అధికారులను, ప్రజలను  భయపెడుతున్న  ఫై-లిన్ తుపాన్. పై-లిన్ తుఫాన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. 

 

తుఫాన్ తీవ్రరూపం దాల్చడంతో ముందస్తు చర్యలు చేపట్టింది. తీరం దాటే సమయంలో తుఫాన్ బీభత్సం సృష్టించే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ దీనిపై దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సైనిక దళాలను కోరారు.  ఐఏఎఫ్ కు చెందిన ఐఎల్-76 రెండు విమానాలు ఇప్పటికే తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 

 

విపత్తు నివారణ బృందాలను, సహాయక సామాగ్రిని భువనేశ్వర్ కు తరలించాయి. రెండు సీ 130జే విమానాలు, 18 హెలికాప్టర్లు, రెండు ఏఎన్-32 ఎయిర్ క్రాప్ట్ లు సహాయక చర్యలకు సిద్ధంగా ఉంచారు. పై-లిన్ తుఫాన్ రేపు తీరందాటనుందని వాతావరణ శాఖ తెలిపింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles