Viswaroop comments on cm kiran

viswaroop comments on cm kiran, viswaroop meets on ys jagan in NIMS hospital, ys jagan, ysrcp, congress party, samaikyandhra movement, cm kiran kumar reddy,

viswaroop comments on cm kiran, viswaroop meets on ys jagan in NIMS hospital

కిరణ్ పై నమ్మకం లేకే ఇలా చేశాను

Posted: 10/11/2013 01:24 PM IST
Viswaroop comments on cm kiran

ఉన్న పార్టీని కొత్త పార్టీలోకి వెళ్లిన ప్రతి నాయకుడు , పాత పార్టీ, పాత నాయకులపై విషం వెల్లగక్కటం సహజంగా జరుగుతుంది. ఈ రోజు తీపిగా ఉన్నది రేపు చేదుగా మారుతుందనే విషయాన్ని రాజకీయ నాయకులు బాగా గుర్తు చేస్తున్నారు. పార్టీ మారినందుకు తనలో ఉన్న లోపాలను బయటకు ఎవరు చెప్పారు. కానీ పార్టీ మీదనో, లేక పార్టీలోని నాయకుల మీదనో ..కొన్ని బురద మరకలు చల్లి వెళ్లిపోతారు. ఇప్పుడు మాజీ మంత్రి విశ్వరూప్ కూడా అలాగే చేశారు.

 

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై నమ్మకం లేకే రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి విశ్వరూప్ అన్నారు. ఆయన ఈరోజు నిమ్స్ లో వైఎస్ జగన్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి విశ్వరూప్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విశ్వరూప్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై కేంద్రం ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గటం లేదన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కట్టుబడి ఉందన్నారు. అందుకే వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నట్లు విశ్వరూప్ తెలిపారు. అసెంబ్లీ తీర్మానాన్ని ఓడిస్తామంటూ పదవిలో కొనసాగేందుకు ప్రజలను మభ్య పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles