Move to merge state owned rtc with govt

Move to merge state owned RTC with govt, APSRTC merger into Govt, PCC Chief Botsa, Chief Minister N Kiran Kumar Reddy, government departments

Move to merge state owned RTC with govt

ఆర్టీసి విలీనం పై చర్చలు

Posted: 10/11/2013 10:17 AM IST
Move to merge state owned rtc with govt

ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకోనుందా? దీన్నీ ఓ శాఖగా గుర్తించనుందా? ఈ దిశగా కార్మిక సంఘాలు చేసిన ఒత్తిళ్లపై ప్రభుత్వం తలొగ్గిందా?.. ఈ ప్రశ్నలన్నింటికీ సానుకూల సమాధానమే వినిపిస్తోంది. రూ.5 వేల కోట్ల మేర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని విలీనం చేసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా... ఆర్టీసీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, అప్పులు, సంస్థకు వచ్చే రోజువారీ ఆదాయం, నష్టాలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఓ ఉన్నతస్థాయి కమిటీని వేసింది.

 

ఈ మేరకు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డీ లక్ష్మీ పార్థసారథి జీవో (నంబర్‌ 954) జారీ చేశారు. ఈ కమిటీ వందరోజుల్లో తన నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో.. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 72 రోజు లుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు రెండురోజుల్లో తెరపడే అవకాశం ఉంది. ఈరోజు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు బస్‌భవన్‌లో మరోసారి రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం ఆర్టీసీ సమ్మె విర మణపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

 

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌పై సమ్మె చేస్తోన్న ఏపీఎన్జీవోలకు మద్దతుగా ఆర్టీసీ కార్మిక సంఘం కూడా మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఆగస్టు 12వ తేదీ నుంచి నిరవధిక సమ్మె కు దిగిన ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘమైన ఎంప్లాయిస్‌ యూనియన్‌ సీమాంధ్ర పోరాట కమిటీ నేతలు.. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసుకోవా లన్న డిమాండ్‌నూ ప్రభుత్వం ముందుంచారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ పై మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రివర్గ ఉపసంఘం సమక్షంలో వేర్వేరుగా పలుమార్లు జరిగిన చర్చల్లో ఎలాంటి హామీ రాలేదు. ఎంప్లాయిస్‌ యూనియన్‌ డిమాండ్‌పై ముఖ్యమంత్రి, రవాణా మంత్రి సానుకూలంగా స్పందించడమే కాకుండా.. ఆర్థిక అంశాలపై అధ్యయనం చేయడానికి ఉన్నతాధికారుల కమిటీని కూడా వేశారు. సాయంకాలానికే జీవో కూడా వెలువడింది. దీనిపై ఎంప్లాయిస్‌ యూనియన్‌ నేతలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఈరోజు మరోసారి భేటీ అయిన అనంతరం సమ్మె విరమణ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles