Telugu actor sri hari passes away

Telugu Actor Sri Hari passes away, Actor SriHari Passed Away, Actor SriHari died, Actor Srihari Died at Mumbai Lilavati Hospital, Actor Srihari Dead, Telugu Actor Srihari dead, srihari dead, tollywood actor srihari's death, sri hari died, Actor Srihari Passed Away, Actor Srihari Death Photos, Actor Srihari Death reasons, Actor Srihari Health Problem, reasons for Actor Srihari death

Telugu Actor Sri Hari passes away, srihari actor, srihari dead, srihari cine career, srihari Minor, srihari Supporting actor , srihari hero role

నటుడు శ్రీహరి ఇకలేరు..

Posted: 10/09/2013 05:38 PM IST
Telugu actor sri hari passes away

టాలీవుడ్ నటుడు శ్రీహరి కన్నుమూశారు. ఈయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయన ముంబై లోని లీలావతి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 15, 1964 లో జన్మించిన శ్రీహరి పలు తెలుగు చలన చిత్రాలలో నటించారు. నటి శాంతిని వివాహమాడిన శ్రీహారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.

 

శ్రీహారి హైదరాబాద్ లోనే జన్నించారు. 1964 ఆగస్టు 15న హైదరాబాద్ లోని బాలానగర్ లో జన్మించారు. స్టంట్ ఫైటర్ గా కేరిర్ ప్రారంభించిన శ్రీహరిని ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ‘పోలీస్ ’ అనే చిత్రంలో తొలిసారిగా కథానాయకుడిగా నటించారు శ్రీహరి. నటుడు రాంచరణ్ తేజ్ తో కలిసి నటించిన ‘మగధీర ’ చిత్రం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. పలు చిన్న బడ్జెట్ చిత్రాల్లో నటించి వాటి విజయానికి కారణమైన శ్రీహరి ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. భైరవ, దాసన్న, శ్రీశైలం, సామ్రాజం, మేస్త్రీ, సరోజ, భద్రాచలం, పోరు, గణపతి, శ్రీ మహా లక్ష్మీ, హనుమంతు, సింహాచలం, సాంబయ్య, కూలీ, అయోధ్య రామయ్య, విజయరామరాజు, కుబుసం తదితర చిత్రాల్లో నటించిన శ్రీహరిని అభిమానులు రియల్ స్టార్ అని పిలుచుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారక్టర్ ఆర్టిస్టుగా రాణించిన అత్యధిక పారితోషికం తీసుకున్న వ్యక్తి శ్రీహరి.

 

దిగ్ర్బాంతిలో చిత్రపరిశ్రమ

సినీనటుడు శ్రీహరి హఠాన్మరణం పట్ల చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతికి లోనయింది. త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ప్రకటించి కొద్ది రోజులు కాకముందే ఆయన కన్నుమూసిన వార్త అభిమానులను శోకతప్తులను చేసింది. నెలల వయసులోనే కన్నుమూసిన కుమార్తె పేరు మీద శ్రీహరి అక్షర పౌండేషన్ స్థాపించారు. శ్రీహరి మేడ్చల్ ప్రాంతంలో నాలుగు గ్రామాలు దత్తత తీసుకుని అభివ్రుద్ది కార్యక్రమాలను చేపట్టారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles