Leaders demands add antony committee recommendations in cabinet note

leaders demands add antony committee recommendations in cabinet note, Seemandhra leaders meet with Antony committee, Antony Committee, Antony Committee Report, lagadapati rajagopal, minister purandeswari,

leaders demands add antony committee recommendations in cabinet note, Seemandhra leaders meet with Antony committee

మా వల్లే ముందుకు వెళ్లని తెలంగాణ నోట్

Posted: 09/30/2013 08:23 PM IST
Leaders demands add antony committee recommendations in cabinet note

తమ రాజీనామాల ఒత్తిడితోనే కేబినెట్ నోట్ రావడం లేదని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. పార్టీలు, నాయకుల కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. నిజాం కళాశాలలో జరిగిన సకలజన సబ పెట్టుబడి ఉద్యమమని, ఆ ఉద్యమంలో భూకంపం స్రుష్టిస్తామని నేతలు ఇష్టానుసారం మాట్లాడారని లగడపాటి విమర్శించారు. సీఎంకు డెడ్ లైన్లు పెడుతూ రాష్ట్రపతి పాలన విధించాలని వ్యాఖ్యానించారన్నారు. 2014 తర్వాత తెరాస అడ్రస్ గల్లంతవుతుందన్నారు. కర్నూలులో నాయకులతో సంబంధం లేకుండా సభ జరిగింది. హైదరాబాద్ ఎన్నికల్లో పోటీచేసే దిక్కు కూడా తెరాసకు లేదని, వేర్పాటు వాదులు ఆశతో ఉద్యమం చేస్తున్నారని లగడపాటి అన్నారు. అలాగే తమ ఒత్తిడి వల్లే తెలంగాణ ప్రక్రియ ముందుకు వెళ్లడం లేదని కేంద్రమంత్రి పురంధేశ్వరి చెప్పారు. సీమాంధ్ర ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వానికి వివరిస్తున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణపై కేబినెట్ నోట్‌కు ఇంకా తుది మెరుగులు దిద్దలేదని ఆమె చెప్పారు. రాష్ట్ర విభజనకు సంబంధించి అభిప్రాయాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నియమించిన ఆంటోనీ కమిటీ సిఫారసులు కూడా కేబినెట్‌ నోట్‌లో ఉంచాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles