Ap ngos president ashok babu comment on telangana meetings

ap ngos president ashok babu comment on telangana meetings, ap ngos president ashok babu, Ashok Babu Fires On Telangana

ap ngos president ashok babu comment on telangana meetings

మేము తెగిస్తాం

Posted: 09/13/2013 08:35 AM IST
Ap ngos president ashok babu comment on telangana meetings

సమైక్యాంధ్ర సాధనే ధ్యేయంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని, ఈ ఉద్యమంలో ఎన్ని త్యాగాలకైనా సిద్దంగా ఉన్నామని ఎపిఎన్జీవో నేత అశోక్‌బాబు మరోసారి స్పష్టంచేశారు. తెలంగాణ ప్రాంతం లో సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. హైదరాబాద్‌లో పౌరహక్కులను కాపాడాలని, ఎవరి ఉద్యమాలు వారు చేసుకునేలా వీలు కల్పించాలని ఎపిఎన్జీవో భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన కోరారు. ఈ నెల 15 వ తేదీన జరుగనున్న ఎపిఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల జెఎసిలు కలిసి ఉద్యమ ఉదృతికి చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారన్నారు. 16 న సమైక్యాంధ్ర జెఎసి సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణను ఖరారు చేయనుందని పేర్కొన్నారు. అదే రోజు హైకోర్టు తీర్పు రానున్నందున, కోర్టు నిర్ణయంపై కూడా భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించనున్నారన్నారు. సమైక్యాంధ్రుల ఉద్యమాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్రం తెలంగాణ తీర్మానాన్ని అసెంబ్లీకి పంపిస్తే అది వీగిపోయోలా ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని డిమాండ్‌ చేయనున్నామన్నారు. విప్‌ జారీ చేసినా దిక్కరించాలని కోరనున్నామన్నారు. కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధు లు రాజీనామాల వల్లే సిడబ్ల్యూసీ చేసిన తీర్మానం వెనక్కు వెళ్తుందని, ఈ కోణంలోనే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామన్నారు. రాజీనామాలను ఆమోదింప చేసుకున్న ప్రజాప్రతినిధులే ప్రజలతో కలిసి ఉద్యమంలో భాగస్వాములు కావాలన్నారు. ఉద్యోగులను కాకుండా ఇతరులను సభలోకి పంపించడంపై వివరణ ఇచ్చామని, కళాకారులను మాత్రమే పంపించామని చెప్పామన్నారు. తెలంగాణ వాదులు ఎన్నో బహిరంగసభలు పెట్టారని, ఆ సమయంలో లేని ఆంక్షలు మాకెందుకు విధించారని అడిగినట్లు తెలిపారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles