Kotagiri vidhyadhara rao passed away

Kotagiri Vidhyadhara Rao passed away, Vidhyadhara Rao farmer TDP Minister, Vidhyadhara Rao official spokesman, Chiranjeevi, Union Tourism Minister Chirnajeevi

Kotagiri Vidhyadhara Rao passed away

కోటగిరి విద్యాధరరావు ఆకస్మిక మరణం

Posted: 07/20/2013 10:40 AM IST
Kotagiri vidhyadhara rao passed away

పిసిసి అధికార ప్రతినిధి కోటగిరి విద్యాధరరావు ఈ రోజు గుండెపోటుతో మరణించారువిద్యాధరరావు లోగడ తెలుగు దేశం పార్టీ లో మంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో అధికార ప్రతినిధిగా వ్యవహరించారు.

ఈ రోజు విద్యాధరరావు మరణ వార్త విన్న కేంద్ర పర్యాటక శాఖా మంత్రి చిరంజీవి ఢిల్లీ నుంచి హైద్రాబాద్ వచ్చారు. ఏలూరులో విద్యాధరరావు నివాసంలో ఆయన పార్థివ శరీరాన్ని చూసి ఆయన కుటుంబీకులను పరామర్శించటానికి చిరింజీవి ఏలూరు వెళ్ళటానికి సిద్ధమౌతున్నారు.

పంచాయతీ ఎన్నికల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో తూర్పు ఎడవల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారానికి పోవటానికి కారు ఎక్కుతున్న సందర్భంలో హఠాత్తుగా గుండెపోటు వచ్చి మృతి చెందిన విద్యాధరరావు తన చివరి క్షణం వరకూ రాజకీయాలలో పనిచేసిన పేరు దక్కించుకున్నారని పలువురు రాజకీయ నాయకులు అన్నారు.

-శ్రీజ

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles