Konda surekha fire pcc chief botsa

konda fire botsa, botsa satyanarayana pcc chief, konda surekha ysrcp, roja, konda surekha, ysr congress, botsa satyanarayana

YSR Congress Party leader and Former Minister Konda Surekha demanded PCC cheif Botsa Satyanarayana to reveal why Anil Kumar was met him.

నీకు పేకాట చరిత్ర లేదా ?

Posted: 07/20/2013 07:57 AM IST
Konda surekha fire pcc chief botsa

పీసీసీ ఛీఫ్ బొత్సా సత్యనారాయణ దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి పై చేసిన మధ్యం వ్యాఖ్యలకు ఆ పార్టీ నేతలు కొండా సురేఖ, ఉదయభాను, జలీల్ బొత్స పై మూకుమ్మడి మాట యుద్దం చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి మంత్రులను పిలిచి టీలు, టిఫిన్లు ఇచ్చి సంతకాలు చేకరించే ఆలోచన ఆయన చేసింది కాదా ? వైయస్ మందు తాగితే ఈయన సప్లై చేసేవారా అని ఎద్దేవా చేశారు. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్‌కు బొత్స ఏం సాయం చేశారో ప్రజల ముందు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మద్యం, పేకాట లేకుండా బొత్సకు రోజు గడవదన్నారు. ఎంపిగా ఉండే పేకాట ఆడిన చరిత్ర ఆయనదన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే మనిషి బొత్స అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైయస్ చలువ లేకుంటే బొత్స సాధారణ కార్యకర్తగా మిగిలే వారన్నారు.  వైయస్ రాజశేఖర రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బొత్స వెంటనే క్షమాపణ చెప్పాలని ఆ పార్టీకి చెందిన నేతలు డిమాండ్ చేశారు. ఆ పార్టీ మరో నేత అయిన రోజా విజయమ్మ ఫీజు దీక్ష ముగింపులో మాట్లాడుతూ...కిరణ్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపిన ఫీజు రీయింబర్సుమెంట్స్ పథకాన్ని కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు నిర్లక్ష్యం చేస్తోందన్నారు. పేదవాడి కన్నీరు కత్తికంటే పదునైందన్నారు. అది ప్రభుత్వానికి శాపంగా మారుతుందని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles