Veteran actor pran krishan sikand passes away

ran passes away, Pran dies, Pran Krishan Sikand, Pran actor, Badi Behen, Jis Desh Mein Ganga Behti Hai, Half Ticket, Purab Aur Paschim, Don, Zanjeer

Veteran Bollywood actor Pran Krishan Sikand, who played the dreaded villain and lovable character with elan in hits.

బాలీవుడ్ మిలన్ ప్రాణ్ కన్నుమూత

Posted: 07/13/2013 07:26 AM IST
Veteran actor pran krishan sikand passes away

ప్రముఖ బాలీవుడ్ నటుడు, దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత, పద్మభూషన్ గ్రహీత అయిన ప్రాణ్ (93) శుక్రవారం రాత్రి లీలావతి ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను మూడు వారాల క్రితం ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుండి ఆయనను వెంటిలేటర్ పైనే ప్రాణ్ నిన్న రాత్రి తుది శ్వాస విడిచాడు. ఈయన అసలు పేరు ప్రాణ్ కిషన్ సికంద్. 1940 లో సినిమా కెరియర్ ప్రారంభించిన ప్రాణ్ 400 పైగా సినిమాల్లో నటించాడు. అటు బాలీవుడ్ ప్రేక్షకులకే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రాణ్ సుపరిచితం.  1920, ఫిబ్రవరి 12న పాతఢిల్లీలోని ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి లాలా కేవల్ కిషన్ సికంద్ సివిల్ ఇంజనీర్, ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టర్. తల్లి రామేశ్వరి. ప్రాణ్ కిషణ్ కి ఇద్దరు కుమారులు ఉన్నారు. 1986లో విడుదలైన తాండ్ర పాపారాయుడు సినిమాలో బుస్సీ దొరగా, 1990లో వచ్చిన కొదమసింహం సినిమాలో మేయర్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను అలరించారు.

1960, 70ల్లో విడుదలైన భారీ బడ్జెట్ హిందీ సినిమాలన్నిటిలోనూ ఆయన నటించారు. ఆయన కెరీర్‌లో మిలాన్, మధుమతి, కశ్మీర్ కీ కలి వంటి క్లాసిక్స్ ఉన్నాయి. జంజీర్, డాన్, అమర్ అక్బర్ ఆంటోనీ, వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించి మేటి విలన్ గా పేరు తెచ్చుకున్నారు. 1990 తరువాత ఆరోగ్యం సహకరించిక వెండితెరకు దూరం అయ్యారు. 2000 సంవత్సరంలో స్టార్ డస్ట్ పత్రిక ఆయన్ను 'విలన్ ఆఫ్ ద మిల్లీనియం'గా అభివర్ణించింది. సీఎన్ఎన్ ప్రకటించిన ఆసియాలో టాప్ 25 నటుల జాబితాలో ప్రాణ్ కూడా ఉన్నారు. 2001లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్‌తో గౌరవించింది. కాగా ప్రాణ్ మృతి పట్ల దేశవ్యాప్తంగా రాజకీయ,సినీప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles