Congress working committee to take decision on telangana issue

Congress Working Committee to take decision, Telangana issue, congress core committee, telangana issue, congress pending, kiran, damodara, botsa presentation, cwc meeting next week

The Core Group of the Congress which met here today to discuss the creation of a separate Telengana State, has communicated the outcome to the Congress Working Committee, the party's highest decision making body, which will now take a final call on the issue.

వర్కింగ్ కమిటీలో తేల్చేస్తారట

Posted: 07/12/2013 07:58 PM IST
Congress working committee to take decision on telangana issue

తెలంగాణ పై కోర్ కమిటీలో ఈనెల 12 తరువాత ఏదో ఒకటి తేల్చేస్తున్నాం...తేల్చేస్తున్నాం... అని డప్పులు కొట్టి మరీ సాటింపు చేసుకున్న కాంగ్రెస్ అధిష్టానం నేడు జరిపిన కోర్ కమిటీ సమావేశం తరువాత మళ్లీ పాత పాటే పాడింది.  ఎంతో హడావుడి చేసి, రోడ్ మ్యాప్ లు, నివేదికలతో రండి అంటూ చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం తీరా అక్కడికి వెళ్లాక, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణలు తమ,తమ నివేదికలను, అభిప్రాయాలను విన్న అధిష్టానం తీరా చల్లని చావు కబురు చెప్పింది. సాయంత్రం నాలుగు గంటలకు ఆరంభమైన ఈ సమావేశం సుమారు గంటా ఏభై నిమిషాల సేపు జరిగింది. ఈ సమావేశం తరువాత పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ అక్కడ జరిగిన విషయాలను మీడియాకు వెల్లడించారు. ఈ కోర్ కమిటీలో అందరి అభిప్రాయాలు విన్నామని, దీని పై సీడబ్ల్యూసీ లో నిర్ణయం తీసుకుంటామని దిగ్గీ చెప్పారు. దీంతో ఏదో తేల్చేస్తారని అనుకున్న వారికి నిరాశే ఎదురైంది. . దీనిని బట్టి అందరూ ఊహిచిన విధంగా తెలంగాణపై ఇప్పటికిప్పుడు తన అబిప్రాయం చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దపడలేదని అర్ధం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌తో పాటు ఈ సమావేశంలో ఇంకా అహ్మద్ పటేల్, ఆంటొనీ, సుశీల్ కుమార్ షిండే, అహ్మద్ పటేల్, ఆజాద్ పాల్గొన్నారు. తెలంగాణ వాదులు మాత్రం ఊహించినట్లుగానే నిర్ణయం ఏమీ తీసుకోలేదని ఇలాంటి కల్లిబొల్లి మాటలు గతంలో ఎన్నోచెప్పారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles