Political rajnath singh rejects lk advani resignation letter

lk advani resignation letter, rajnath singh rejects, bjp, lk advani, narendra modi, rajnath singh, venkaiah naidu, bjp president rajnath singh, sushma swaraj, gujarat chief minister narendra modi,

rajnath singh rejects LK Advani resignation letter

రాజీనామా రిజక్ట్ - ముఖ్యనేతలు అధ్వానీతో భేటీ ?

Posted: 06/10/2013 04:24 PM IST
Political rajnath singh rejects lk advani resignation letter

అద్వానీ రాజీనామా దురదృష్టకరమని బీజేపీ సీనియర్ నాయకురాలు లోక్ సభలో ప్రతిపక్షనేత అయిన సుష్మా స్వరాజ్‌ వ్యాఖ్యానించారు. అద్వానీ తన రాజీనామా వెనక్కితీసుకోవాలని ఆమె కోరారు. అంతకుముందు అద్వానీని ఆమె కలిశారు. బీజేపీ ఉపాధ్యక్షుడు ఎస్ఎస్ ఆహ్లువాలియా, సీనియర్ నేతలు వెంకయ్య నాయుడు, వీకే మల్హోత్రా కూడా అద్వానీని కలిసి రాజీనామ ఉపసంహరణకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో అన్నీ పదవులకు రాజీనామా చేస్తూ అద్వానీ రాసిన రాజీనామా లేఖ ను ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తిరస్కరించారు. అయితే వెంటనే పార్టీ సినీయర్ నేత వెంకయ్యనాయకుడు తో రాజ్ నాథ్ సింగ్ భేటీ అయ్యారు. అద్వానీ పార్టీ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అద్వానీ రాజీనామా పై బాధకరం వ్యక్తం చేశారు. దేశంలో బాజపా బలపడడానికి కారణం అద్వాని , అటల్ జీల సేవలని ఆయన అన్నారు. పార్టీలోనే ముఖ్య నాయకులు అందరు అద్వానీ నివాసంలో భేటీ అయ్యారు. అద్వానీ చేసిన రాజీనామాను ఉపసంహరించుకోవాలాని పార్టీ ముఖ్య నేతలు అద్వానీని కోరినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles