Narendra modi as chairman of poll panel for 2014

Narendra Modi,Vajpayee,Rajnath,Narendra Modi,Advani,The move,Rajnath Singh,Manohar Parrikar,Lok Sabha,Lok Sabha campaign committee

After much speculation, Gujarat CM Narendra Modi was named chairman of the BJP campaign committee for the Lok Sabha polls scheduled for 2014.

మోడీకే ప్రచార పగ్గాలు

Posted: 06/10/2013 09:23 AM IST
Narendra modi as chairman of poll panel for 2014

భారతీయ జనతాపార్టీ నేత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కి అంత్యంత కీలకమైన పదవిని కట్టబెట్టారు. ఆయనను 2014 ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మెన్ గా నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. మొదటి నుండి ఈయనే బీజేపీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమింపబడతాడని ప్రచారం జరిగింది. కానీ మధ్యలో బీజేపీ సీనియర్ నేతలు కొన్ని అభ్యంతరాలు చెప్పినా, కురువృద్ధుడు అద్వానీ వ్యతిరేకించినా చివరకు ఆయనకు నచ్చజెప్పి మోడీని ప్రచార సారథిగా నియమించారు. ఈ విషయాన్ని ప్రకటించగానే సభికులు అందరు ఒక్కసారి కరతాల ధ్వనులతో మోడీని అభినందన తెలిపారు. పైకి ప్రచార సారథ్యం అప్పగించినా.. బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధిస్తే ఆయనకే ప్రధానమంత్రి పదవి అప్పగించాలని అంతర్గతంగా నిర్ణయం జరిగింది. మోడీ రాకతో పార్టీలో నూతనోత్తేజం వెల్లివిరుస్తుందని, ఇక బీజేపీ దూసుకుపోవడం ఖాయం అని అంటున్నారు. ఇక ప్రచార సారథిగా ఎంపికైన మోడీ దేశ వ్యాప్తంగా దేశంలోని 200 కీలక ప్రాంతాల్లో నరేంద్ర మోడీ ఉధృతంగా పర్యటించాలని నిర్ణయించింది. వీటికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడవుతాయి. మొత్తానికి మోడీని ప్రచారసారథిగా నియమించడంతో ఇక పార్టీ దూసుకుపోవడం ఖాయం అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles