Pc chacko announcement on telangana made tremors in the state

telangana not national issue, pc chaco announcement on telangana, osmania university jac, gandhi bhawan, telangana congress leaders

pc chacko announcement on telangana made tremors in the state

చాకో ప్రకటనలతో రాష్ట్రంలో ప్రకంపనలు

Posted: 05/19/2013 01:36 PM IST
Pc chacko announcement on telangana made tremors in the state

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పి.సి.చాకో మాటలకు ఆగ్రహించిన ఉస్మానియా జెఏసి ఈ రోజు గాంధీ భవన్ ముట్టడికి యత్నం చేసింది.  జెఏసి విద్యార్థి నేతలు చాకో దిష్టిబొమ్మను తగులబెట్టి ఊకుమ్మడిగా గాంధీ భవన్ ని ముట్టడి చేసే ప్రయత్నం చేసారు.  దానితో పోలీసులు వారిని అడ్డుకొని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. 

జాతీయ అజెండాలో తెలంగాణా అంశం లేదని చాకో నిన్న స్పష్టం చేసారు.  దానితో తెలంగాణా ఉద్యమకారులలో ఆగ్రహం పెల్లుబికింది.  యుపిఏ అజెండాలో రాష్ట్రానికి చెందిన మరెన్నో విషయాలున్నాయి కాని తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు మాత్రం కచ్చితంగా లేదని చాకో మీడియా ప్రతినిధులకు చెప్పారు.  ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని కూడా అన్నారాయన.  కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా అజెండాలో ఏమేమి ఉన్నాయో అందులో ఏమేమి చేసామో తెలుసుకాబట్టి తెలంగాణా రాష్ట్రం గురించి అసలు లేనేలేదు కాబట్టి అది పెండింగ్ లో ఉండటమనే ప్రశ్నే ఉదయించదన్నారాయన. 

ఎంపీ వివేక్ నివాసంలో సమావేశమైన తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఈ నేపధ్యంలో భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించుకున్నారు. 

మొత్తానికి తెలంగాణా విషయంలో కాంగ్రెస్ ప్రకటనలు రోజుకో విధంగా మారుతూ ఉత్కంఠను కలిగించటమే కాకుండా ఉద్యమాలకు ఊపిరి పోస్తున్నాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles