Ahobila matham 45th peethadhipati passed away

ahobila matham swamy died, narayana yathindra mahadesikan, ahobila matham

ahobila matham 45th peethadhipati passed away

పరమపదించిన అళగియసింగర్ నారాయణ యతీంద్ర మహాదేశికన్

Posted: 05/19/2013 03:36 PM IST
Ahobila matham 45th peethadhipati passed away

అహోబిలం నరసింహస్వామి మఠం పీఠాధిపతి అళగియసింగర్ నారాయణ యతీంద్ర మహాదేశికన్ అనారోగ్యంతో గత కొద్దిరోజులుగా చెన్నై లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు నిన్న రాత్రి ఆయన ఆరోగ్యం విషమించటంతో అహోబిలం ఆలయంలోని అర్చకులు వెంటనే బయలుదేరి వెళ్ళారు.  పీఠాధిపతిని శ్రీరంగం తరలించారు. 

కానీ 87 సంవత్సరాల వయసుగల 45 వ పీఠాధిపతైన అళగయసింగర్ నారాయణ యతీంద్ర మహాదేశికన్ ఆయన తరువాతి పీఠాధిపతులైన రంగనాధ యతీంద్ర మహాదేశికన్, ఇతర శిష్యబృంద సమక్షంలో అంతిమ శ్వాసను విడిచారు.  పీఠాధిపతుల పరంపరలో నారాయణ అనే పేరుతో వచ్చినవారిలో వీరు ఎనిమిదవ స్వామి. 

సన్యాసం స్వీకరించకముందు వీరి పేరు కృష్ణమాచార్య.  1926లో ఉత్తర ఆర్కోట్ లో విల్లివలమ్ లో జన్మించిన కృష్ణమాచార్య మద్రాస్ విశ్వవిద్యాలయంలో న్యాయశిరోమణిగా ఉత్తీర్ణులైనారు.  ఆ తర్వాత సన్యాసం స్వీకరించి  42, 43  అళగయసింగర్ ల దగ్గర శుశ్రూష చేస్తూ, న్యాయము, మీమీంసల పఠనం చేసారు.  వైష్ణవ సాంప్రదాయంలో ఎంతో సాహిత్య అధ్యయనం చేసిన నారాయణ యతీంద్రులు నరసింహ ప్రియ అనే పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు.

శ్రీభాష్యం, రామాయణ, భారత, భాగవత, భగవద్గీతల మీద ప్రవచనాలలో దిట్టగా పేరుగాంచిన నారాయణ యతీంద్రుల పార్థివ శరీరాన్ని 1991లో మఠం బాధ్యతలను అప్పజెప్పి పరమపదించిన 44 వ జీయర్ బృందావనం దగ్గరే అంతిమ సంస్కారాలు చేస్తామని మఠం సిఇవో రాజగోపాలన్ తెలియజేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles